‘పద్మావత్’ ఫుల్ మూవీ లీక్: తెగించిన ఆందోళన కారులు, ఫేస్‌బుక్ ద్వారా లైవ్...
'పద్మావత్' సినిమాను బ్యాన్ చేయాలని ఓ వైపు ఆందోళనలు జరుగుతుండగా... మరో వైపు సినిమాను పైరసీ చేసి నష్టపరిచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తాము చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారనే కోపంతో కర్ని సేనలు ఈ దురాగతానికి పాల్పడ్డట్లు భావిస్తున్నారు.

ఫేస్ బుక్ ద్వారా లైవ్
సినిమాను నష్టపరచాలనే ఉద్దేశ్యంతో థియేటర్ నుంచి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా సినిమాను ప్రదర్శించారు. 'జాతోంకా అడ్డా' అనే ఫేస్‌బుక్ పేజీ పద్మావత్ సినిమాను ఫేస్‌బుక్‌లో లైవ్ ద్వారా ప్రసారం చేసింది.

లక్షల మంది చూశారు
ఫేస్ బుక్ ద్వారా లైవ్ ప్రసారం అయిన సినిమాను 3.5 లక్షల మందికి పైగా ఆన్ లైన్లో వీక్షించారు. దాదాపు 15వేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. షేర్ చేసినవారంతా ఆందోళనకారులే అని భావిస్తున్నారు.

భయంతో సినిమాకు దూరంగా
‘పద్మావత్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై కర్నిసేనలు దాడులకు పాల్పడుతున్న నేపత్యంలో చాలా ప్రాంతాల్లో ప్రేక్షకులు భయపడిపోయి ఆ సినిమా చూడటలానికి వెళ్లడం లేదు.

మొదటి నుండి అడ్డంకులే
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదట్నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. రాజ్‌పుత్ రాణుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా సినిమా ఉందని కర్నిసేన, కొన్ని హిందూ సంఘాలు ఈ చిత్రంపై ఆందోళన చేయడంతో సెన్సార్ బోర్డు చరిత్ర కారుల సమక్షంలో ఈ చిత్రాన్ని సెన్సార్ చేసి సర్టిఫికెట్ జారీ చేసింది.

పద్మావత్
దీపిక పదుకోన్ ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించారు.

200 కోట్ల సినిమా
దాదాపు రూ. 200 కోట్ల ఖర్చుతో ‘పద్మావత్' చిత్రాన్ని నిర్మించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, సినిమా విడుదల ఆలస్యం నేపథ్యంలో ఇప్పటికే చాలా నష్టం జరిగింది. తాజా పరిణామాలు నిర్మాతలకు మరింత నష్టం తేచ్చేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











