twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోతలు, వాతల తర్వాత .... ‘పద్మావతి’ ఇలా తయారైంది!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఆఖరికి ‘పద్మావతి’ ఇలా తయారైంది !

    పలు వివాదాల కారణంగా రిలీజ్ ఆగిపోయిన 'పద్మావతి' మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. సినిమాపై రాజ్ పుత్ వంశీయులు ఆందోళన చేయడంతో.... సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో కొన్ని సీన్లకు కోతలు, సినిమాలో వాడిన కొన్ని అంశాలపై దర్శక నిర్మాతలకు వాతలు పెట్టిన సంగతి తెలిసిందే. సినిమా పేరును కూడా 'పద్మావత్' గా మార్చారు. మార్పుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ పొంగల్ సందర్భంగా విడుదల చేశారు.

    అఫీషియల్ ట్రైలర్

    సినిమాలో కొన్ని సన్నివేశాల తొలగింపు, టైటిల్ మార్పు అనంతరం విడుదలైన ట్రైలర్ ఇదే. ‘పద్మావత్'గా టైటిల్ మార్పు, కొన్ని సీన్ల కత్తిరింపు తప్ప పెద్దగా మార్పులు ఏమీ లేదని తెలుస్తోంది.

    చరిత్రకారుల సూచనతో మార్పులు

    చరిత్రకారుల సూచనతో మార్పులు

    ఈ సినిమాపై ఆందోళనలు రేకెత్తడంతో సెన్సార్ బోర్డ్ చ‌రిత్ర‌కారుల స‌హాయం తీసుకుంది. వారి స‌ల‌హా మేర‌కు ఓ ఐదు మార్పుల‌ను సూచించింది. ఇది చారిత్రక సంబంధం లేని కల్పిత కథగా సినిమా ప్రారంభంలో ప్రకటించాలని, సినిమా పేరును పద్మావతి బదులు పద్మావత్‌గా మార్చాలని, సినిమాలోని ఘూమర్‌ పాటలో మార్పు చేయాలని, తప్పుగా చూపించిన చారిత్రక ప్రదేశాల చిత్రీకరణలను కూడా సరిచేయాలనే సెన్సార్ బోర్డు సూచనలకు దర్శక నిర్మాతలు అంగీకరించడంతో సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది.

    పద్మావత్

    పద్మావత్

    సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    అత్యాధునిక టెక్నాలజీ

    అత్యాధునిక టెక్నాలజీ

    ఈ చిత్రాన్ని 3డితో పాటు ఐమాక్స్ 3డి ఫార్మాట్లో విడుదల చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఇదో గొప్ప చిత్రం అవుతుందని భావిస్తున్నారు.

    భారీగా బంగారం

    భారీగా బంగారం

    400 కేజీల బంగారం ఈ సినిమా కోసం 400 కేజీల బంగారం వాడారట. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద జ్యువెల్లరీ సంస్థ అయిన తనిష్క్ తో టై అప్ అయ్యారు. ఆభరణాల కోసం దాదాపు 200 మంది క్రాఫ్ట్ మెన్, 600 రోజుల పాటు కష్టపడ్డారు.

    కల్పిత కథే కానీ నేపథ్యం ఇదే...

    కల్పిత కథే కానీ నేపథ్యం ఇదే...

    రాణి పద్మావతి పాలిస్తున్న చిత్తోర్ కోటను 1303 సంవత్సరంలో ఉల్లాఉద్దీన్ ఖిల్జీ ముట్టడించాడు. ఆ యుద్ధం ఎపిసోడ్ ను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ‘పద్మావత్' చిత్రం సాగుతుందని తెలుస్తోంది.

    రణవీర్ సింగ్

    రణవీర్ సింగ్

    ఈ చిత్రంలో మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ట్రైలర్లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉంది. భారీ శరీరంతో, ఎంతో క్రూరమైన లుక్ లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడని తెలుస్తోంది.

    షాహిద్ కపూర్

    షాహిద్ కపూర్

    ఈ చిత్రం షాహిద్ కపూర్ పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. రాజ్ పుత్ వంశరాజుగా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం లెక్కచేయని వీరుడి పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.

    దీపిక బ్యూటిఫుల్ లుక్

    దీపిక బ్యూటిఫుల్ లుక్

    ‘పద్మావతి'గా టైటిల్ రోల్ చేస్తున్న దీపిక పదుకోన్ ఎంతో బ్యూటిఫుల్‌గా సినిమాలో కనిపించింది. ఆమె కెరీర్లో ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. చరిత్ర ప్రకారం అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్ కోటను ఆక్రమించి... కోటను స్వాధీనం చేసుకుని రావతల్ రతన్ సింగ్ ను చంపేసిన సమయంలో.... పద్మావతితో పాటు కోటలోని మహిళలంతా అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ సినిమాలో కూడా పద్మావతిని అలాగే చూపిస్తారని తెలుస్తోంది.

     అంచనాలు భారీగా

    అంచనాలు భారీగా

    సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ కలిసి నటించడం ఇది మూడో సారి. గతంలో వారు రామ్-లీలా, బాజీరావు మస్తానీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ‘పద్మావత్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జనవరి 25న సినిమా విడుదల కాబోతోంది.

    English summary
    Presenting the Official Trailer of Padmaavat starring Deepika Padukone, Ranveer Singh, Shahid Kapoor, Aditi Rao Hydari and Jim Sarbh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X