twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోర్టుకెక్కిన ‘పద్మావత్’ నిర్మాతలు..... అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు!

    By Bojja Kumar
    |

    సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల్లో 'పద్మావత్' చిత్రం విడుదల కాకుండా బ్యాన్ విధించడంపై నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికి లేదు

    అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికి లేదు

    సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని తమ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ విడుదలయ్యేలా చూడాలని ‘పద్మావత' చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

    Recommended Video

    ఆఖరికి ‘పద్మావతి’ ఇలా తయారైంది !
    ఇప్పటికే చాలా నష్టపోయారు

    ఇప్పటికే చాలా నష్టపోయారు

    ‘పద్మావతి' చిత్రంపై రాజ్ పుత్ వంశీయులు ఆందోళన చేయడంతో డిసెంబర్ 1న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడి, సెన్సార్ బోర్డు సూచనల మేరకు సినిమాలో మార్పులతో పాటు టైటిల్ ‘పద్మావత్'గా మార్చి జనవరి 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర నిర్మాతలు భారీగా నష్టపోయారు.

    ప్రచారాలకు దూరంగా

    ప్రచారాలకు దూరంగా

    సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినిమా వివాదంలో ఉండటంతో వీరంతా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారు.

    రణవీర్ సింగ్

    రణవీర్ సింగ్

    ఈ చిత్రంలో మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ట్రైలర్లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉంది. భారీ శరీరంతో, ఎంతో క్రూరమైన లుక్ లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడని తెలుస్తోంది.

    షాహిద్ కపూర్

    షాహిద్ కపూర్

    ఈ చిత్రం షాహిద్ కపూర్ పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. రాజ్ పుత్ వంశరాజుగా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం లెక్కచేయని వీరుడి పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.

    దీపిక బ్యూటిఫుల్ లుక్

    దీపిక బ్యూటిఫుల్ లుక్

    ‘పద్మావతి'గా టైటిల్ రోల్ చేస్తున్న దీపిక పదుకోన్ ఎంతో బ్యూటిఫుల్‌గా సినిమాలో కనిపించింది. ఆమె కెరీర్లో ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. చరిత్ర ప్రకారం అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్ కోటను ఆక్రమించి... కోటను స్వాధీనం చేసుకుని రావతల్ రతన్ సింగ్ ను చంపేసిన సమయంలో.... పద్మావతితో పాటు కోటలోని మహిళలంతా అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ సినిమాలో కూడా పద్మావతిని అలాగే చూపిస్తారని తెలుస్తోంది.

    3డి విడుదల

    3డి విడుదల


    ఈ చిత్రాన్ని 3డితో పాటు ఐమాక్స్ 3డి ఫార్మాట్లో విడుదల చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఇదో గొప్ప చిత్రం అవుతుందని భావిస్తున్నారు.

    English summary
    Controversial film 'Padmaavat's' producer today moved the Supreme Court (SC) challenging the ban on its screening by some states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X