twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పద్మావత్’ చిచ్చు: థియేటర్లను ధ్వంసం చేస్తున్న ఆందోళన కారులు!

    By Bojja Kumar
    |

    సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావత్' సినిమా జనవరి 25న విడుదలవుతున్న నేపథ్యంలో ఆందోళనలు ముదురు తున్నాయి. సినిమా ప్రదర్శించడానికి వీల్లేదని, బ్యాన్ విధించాలని రాజ్‌పుత్ సంఘాలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి.

    కోర్టు తీర్పును ధిక్కరిస్తూ

    కోర్టు తీర్పును ధిక్కరిస్తూ

    ‘పద్మావత్' సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు... సుప్రీం కోర్టు నుండి కూడా ఈ సినిమాను అడ్డుకోవడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరిసతూ రాజ్ పుత్ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.

    మనోభావాలు దెబ్బతింటాయి


    తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేయ‌కూడ‌ద‌ని రాజ్‌పుత్‌ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని హెచ్చరించిన ఆందోళనకారులు బీహార్‌లోని ముజఫర్‌పుర్‌లోని ఓ థియేటర్ వద్ద విధ్వంస కాండ సృష్టించారు.

    పలు చోట్ల ఆందోళనలు

    పలు చోట్ల ఆందోళనలు

    ‘పద్మావత్' సినిమా ప్రదర్శించడానికి వీల్లేదంటూ దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళన కారులు హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. పరిస్థితి ఇలానే ఉంటే నిర్మాతలు మరింత నష్టపోయే అవకాశం ఉంది.

    మొదటి నుండి అడ్డంకులే

    మొదటి నుండి అడ్డంకులే


    సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మొద‌ట్నుంచి ఆటంకాలే ఎదుర‌వుతున్నాయి. రాజ్‌పుత్ రాణుల ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించేలా సినిమా ఉండ‌బోతోంద‌ని క‌ర్నిసేన, కొన్ని హిందూ సంఘాలు ఈ చిత్రంపై ఆందోళన చేయడంతో సెన్సార్ బోర్డు చరిత్ర కారుల సమక్షంలో ఈ చిత్రాన్ని సెన్సార్ చేసి సర్టిఫికెట్ జారీ చేసింది.

    రూ. 200 కోట్ల బడ్జెట్

    రూ. 200 కోట్ల బడ్జెట్

    దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ‘పద్మావత్' చిత్రాన్ని నిర్మించారు. దీపిక పదుకోన్ ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించారు. పద్మావతి భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌, అల్లావుద్దీ‌న్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు.

    English summary
    Karni Sena, the fringe group that has been at the forefront of protests against Sanjay Leela Bhansali's film, Padmavaat, has refused to back down after the Supreme Court told states that they could not ban the movie on grounds of risk to public order. Karni Sena leader, Lokendra Singh, asked social organisations across the country to make sure the movie is not shown in cinema halls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X