twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా షాక్: ఆ ఇద్దరు హీరోలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు!

    By Bojja Kumar
    |

    ఓ వైపు బాలీవుడ్ మూవీ 'పద్మావత్' వివాదాల్లో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతోంది. మరో వైపు ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ నటనలో నేను గొప్ప అంటే... నేను గొప్ప అంటూ ఒకరి మీద ఒకరు విమర్శలు, సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోల మాటల యుద్ధం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.

     ఇద్దరు హీరోల మధ్య ఇగో ఇష్యూ

    ఇద్దరు హీరోల మధ్య ఇగో ఇష్యూ

    ‘పద్మావత్' చిత్రంలో రణవీర్ సింగ్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో నెగెటివ్ రోల్ చేయగా.... రాణి పద్మావతి భర్త రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ఇగో ఇష్యూలు ఉండేవని సమాచారం.

     షాహిద్ కన్నేశాడు

    షాహిద్ కన్నేశాడు

    పద్మావత్ చిత్రం షూటింగ్ జరుగుతున్నంత కాలం రణ్‌వీర్ పాత్రపై షాహీద్‌ కన్నేశాడు. రణ్‌వీర్ ఆ పాత్రకు న్యాయం చేయగలడనే నమ్మకం ముందు నుండీ అతడికి ఉండేది కాదని ‘పద్మావత్' యూనిట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు.

     గొడవ మొదలు పెట్టిందెవరు?

    గొడవ మొదలు పెట్టిందెవరు?

    మాటల యుద్ధానికి తొలుత రణ్‌వీర్ సింగ్ తెరలేపాడు. షాహీద్ నటించిన 'కమీనే' చిత్రాన్ని ఒకవేళ తాను చేసి ఉంటే అతని కంటే గొప్పగా నటించి ఉండే వాడిని.... అంటూ రణవీర్ సింగ్ కామెంట్స్ చేశారు.

    ఎదురు దాడి ప్రారంభించిన షాహిద్

    ఎదురు దాడి ప్రారంభించిన షాహిద్

    రణవీర్ సింగ్ పాత్రలకు హర్ట్ అయిన షాహిద్ కపూర్ వెంటనే ఎదురు దాడి ప్రారంభించాడు. పద్మావత్‌లో రణ్‌వీర్ చేసిన ఖిల్జీ పాత్ర తనకు దక్కి ఉంటే అతని కంటే విలక్షణంగా చేసి ఉండేవాడిని అని తెలిపారు.

    పరిస్థితి వేడెక్కక ముందే...వార్నింగ్

    పరిస్థితి వేడెక్కక ముందే...వార్నింగ్

    అయితే ఈ ఇద్దరి మాటల యుద్ధంతో పరిస్థితి వేడెక్కక ముందే.... ‘పద్మావత్' చిత్ర యూనిట్ రంగంలోకి దిగింది. ఇద్దరి మధ్య రాజీక కుదిర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. మీ మూలంగా సినిమా నష్టపోకూడదని ఇద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

    కంపేర్ చేయడం తగదు

    కంపేర్ చేయడం తగదు

    ఏ నటుడైనా తనకు అవకాశం వచ్చిన పాత్రకు న్యాయం చేయడానికి శక్తి మేర ప్రయత్నిస్తారు. ఒకరు చేసిన పాత్రలను మరొకరితో కంపేర్ చేయడం సరికాదు. ఓ వైపు సినిమా థియేటర్లో ఆడుతుండగా ఒకే చిత్రంలో నటించిన ఇద్దరు నటులు విమర్శలు చేసుకోవడం సినిమాపై ప్రభావం చూపుతుంది, దీనికి వీరు ఇకపైనా పులిస్టాప్ పెట్టాలని పద్మావత్ యూనిట్ సభ్యులు కోరుతున్నారు.

    English summary
    Shahid Kapoor has never shied away from taking risks, be it opting for intense roles or doing multi-starrer projects, and the actor says what defines his success story are the "smart choices" he made over the years. In the past, Shahid has worked in multi-starrers such as "Udta Punjab", "Rangoon" and most recently "Padmaavat" alongside Ranveer Singh. There is a perception in the film industry that two male stars find it difficult to work together owing to their big egos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X