పద్మాలయా స్టూడియో భూముల బదలాయింపు వ్యవహారంపై సినీ నటుడు కృష్ణతో సహా కుటుంబ సభ్యులు,ఇతర ప్రతివాదులకు హైకోర్టు బుధవారం కోర్టు నోటీసులు జారీచేసింది. స్టూడియోకు కేటాయించిన భూములను ఇతరులకు బదలాయించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధాఖలా చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్.దవే, జస్టిస్ రమేష్ రంగనాధన్ లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
Story first published: Thursday, January 22, 2009, 13:53 [IST]