కె.విశ్వనాధ్ కొత్త చిత్రం 'సుమధరం' హీరోయిన్ ఆమె?
కె.విశ్వనాధ్,అల్లరి నరేష్ కాంబినేషన్లో సుమధురం అనే చిత్రం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ గా మళయాళ హీరోయిన్ పద్మప్రియను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె మేనేజర్ ని సంప్రదించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పద్మప్రియ తెలుగుకు కొత్తేమి కాదు. ఆమె గతంలో శ్రీను..లక్ష్మీ..వాసంతి లో చేసింది. అయితే ఆ చిత్రం పరాజయం పాలవటంతో ఆమెకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. దాంతో తమిళ, మళయాళ చిత్రాలలో నటిస్తూంది. ఇక ఈ పాత్ర కోసం మొదట శృతిహాసన్, సోనమ్ కపూర్ ని అడిగారు.అయితే వారు పలు కారణాలతో రిజెక్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు మిరుగం(మృగం) చిత్రంతో తమిళ స్టేట్ అవార్డు పొందింది.
కె.విశ్వనాధ్ అల్లరి నరేష్ పద్మ ప్రియ శ్రీను..లక్ష్మీ..వాసంతి శృతిహాసన్ సోనమ్ కపూర్ మృగం సుమధురం k.viswanath allari naresh padma priya sruthi hassan sonam kapoor mrugum sumadhuram


Click it and Unblock the Notifications