Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నన్ను పూర్తిగా సంతృప్తిపరస్తేనే...పద్మ ప్రియ
నేను టిక్కెట్ కొనుక్కుని సినిమాకెళితే ఆ సినిమా నన్ను పూర్తిగా సంతృప్తిపరచాలనుకుంటాను. ఒకప్పుడు ఏరికోరి అలాంటి సినిమాలకే వెళ్లేదాన్ని అంటోంది పద్మ ప్రియ. తాజాగా అందరి బంధువయా చిత్రంతో తెలుగువారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ తన మనోభావాలను మీడియా ముందుంచింది. ఆమె మాటల్లోనే...ఓ ప్రేక్షకురాలిగా నా డబ్బుకి ఎలా న్యాయం జరగాలని కోరుకుంటానో ఇతరు ప్రేక్షకులు కూడా అలానే కోరుకుంటారు కదా. అందుకే నేను చేసే ప్రతి సినిమా, ప్రతి పాత్ర ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చేదై ఉండాలని కోరుకుంటాను. అలాంటివాటినే ఎన్నుకుంటాను అంది. అలాగే కళాకారులకు భాషతో సంబంధం లేదు. నాకు ఎక్కడ మంచి పాత్ర లభిస్తే అక్కడ చేస్తా. చెట్టు చుట్టూ తిరిగి పాటలు పాడుకునే పాత్రలను నేను ఇష్టపడను. ఏ పాత్ర చేసినా అందులో ఎంతో కొంత ప్రయోజనం ఉండాలని కోరుకుంటాను. భవిష్యత్తు లో వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు సంతృప్తి లభించాలి. అందుకే ఆచితూచి సినిమాలు ఎన్నుకుంటున్నాను అని వివరించింది.