ఒక్క ఛాన్స్...కమర్షియల్ డైరక్టర్స్ కు పద్మప్రియ రిక్వెస్ట్...
చంద్ర సిద్దార్ధ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన 'అందరిబంధువయ' చిత్రంలో హీరోయిన్ గా చేసిన పద్మ ప్రియ గుర్తుండే ఉంటుంది. ఎక్కువగా అభినయానికి ఆస్కారమున్న ప్రయోగాత్మక చిత్రాల్లోనే ఇన్నాళ్ళూ నటిస్తూ వచ్చిందామె. అయితే ఆమెకు పర్శనల్ గా రొమాంటిక్ కామిడీలంటే ఇష్టమని చెప్తోంది. ఆ విషయమై మాట్లాడుతూ..."అన్ని రకాల పాత్రలనూ చేసి మెప్పించగలిగితేనే నటికి ఓ గుర్తింపు. మహానటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్న వారందరూ కమర్షియల్ సినిమాల్లో నటించి, మెప్పించినవారే..అందుకే నాకు కూడా కమర్షియల్ సినిమాలో చేయాలనుంది' అంది. అలాగే 'కామెడీ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అలాంటి సినిమాల్లో చేయాలనుంది. ఇంకా కమర్షియల్ విలువలతో ఉంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కూడా చేయాలని ఉంది. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా' అంటోంది. అంటే నాకూ మీరు రెగ్యులర్ హీరోయిన్ గా అవకాశమివ్వవచ్చని కమర్షియల్ దర్శకులను రిక్వెస్ట్ చేస్తోందన్నమాట. ఆమె మాటలు విని ఎవరైనా అవకాశమిస్తే బావుంటుంది కదా.


Click it and Unblock the Notifications











