‘పద్మావత్’ (పద్మావతి) రిలీజ్ డేట్ ఖరారైంది

By Bojja Kumar

పలు వివాదాల కారణంగా రిలీజ్ ఆగిపోయిన 'పద్మావతి' మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేశారు. సెన్సార్ బోర్డు సూచనల మేరకు ఈ చిత్రం 'పద్మావత్' పేరుతో విడుదల కాబోతోంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్, రణవీర్ సంగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టైటిల్ మార్పు, ఐదు కట్స్‌తో సెన్సార్ క్లియరెన్స్

టైటిల్ మార్పు, ఐదు కట్స్‌తో సెన్సార్ క్లియరెన్స్

ఈ సినిమాకు సెన్సార్ విభాగం యు/ఎ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఇది చారిత్రక సంబంధం లేని కల్పిత కథగా ప్రకటించాలని, సినిమా పేరును పద్మావతి బదులు పద్మావత్‌గా మార్చాలని, సినిమాలోని ఘూమర్‌ పాటలో మార్పు చేయాలని, తప్పుగా చూపించిన చారిత్రక ప్రదేశాల చిత్రీకరణలను కూడా సరిచేయాలనే సెన్సార్ బోర్డు సూచనలకు దర్శక నిర్మాతలు అంగీకరించడంతో సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది.

Recommended Video

'Padmavati' Trailer Is Released మరో వెండితెర అద్భుతం అయ్యేలా ఉంది...
రెండు నెలల ఆలస్యం, భారీగా నష్టం

రెండు నెలల ఆలస్యం, భారీగా నష్టం

దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వివాదం కారణంగా విడుదల కాలేదు. సినిమా విడుదల ఆలస్యం కావడంతో నిర్మాతలకు భారీగానష్టం వాటిల్లింది.

రాజ్ పుత్ వంశీయుల అభ్యంతరం వల్లే

రాజ్ పుత్ వంశీయుల అభ్యంతరం వల్లే

రాణి పద్మావతి జీవితం ఆధారంగా 'పద్మావతి' సినిమా తెరకెక్కిందనే వాదన ముందు నుండీ ఉండటంతో రాజ్ పుత్ వంశీలు ఈ చిత్రంపై ఆందోళన తెరలేపారు. రాజపుత్రుల చరిత్రను ఈ సినిమాలో పూర్తిగా వక్రీకరించారని ఆరోపించారు. ఈ ఆందోళన ముదిరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావడం, చరిత్ర కారులతో ప్రత్యేక కమిటీ వేయడం, వారి సిపారసుల మేరకు కొన్ని మార్పులు సూచించడం, అందుకు దర్శక నిర్మాతలు అంగీకరించడంతో సెన్సార్ క్లియర్ కావడం జరిగింది.

 దర్శకుడికి, నటీనటులకు బెదిరింపులు

దర్శకుడికి, నటీనటులకు బెదిరింపులు

‘పద్మావతి' సినిమా వివాదం కొసాగిన రోజుల్లో ఆందోళనకారులు సినిమా షూటింగుపై దాడి చేశారు. దర్శకుడిపై చేయి చేసుకున్నారు. దీపిక పదుకోన్‌, ఇతర నటీనటులపై కూడా బెదిరింపులు పాల్పడ్డ సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X