పద్మావతికి 5 కోట్లమంది ప్రేమికులు.. 3డీ ఫార్మాట్‌లో భన్సాలీ చిత్రం
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న పద్మావతి చిత్రం విడుదలకు ముందే సంచలనం రేపుతున్నది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న పద్మావతి చిత్రం విడుదలకు ముందే సంచలనం రేపుతున్నది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది. అనూహ్య స్పందనతో ట్రైలర్ రికార్డు వ్యూస్‌ను నమోదు చేసుకొంటున్నది. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న పద్మావతి ట్రైలర్ రికార్డు ఈ విధంగా ఉంది.

పద్మావతి ట్రైలర్‌కు 5 కోట్ల వ్యూస్
పద్మావతి చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 9న రిలీజైంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌కు 5 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఒకేసారి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రెండింట్లో కలిపి వ్యూస్ 5 కోట్లు దాటాయి.
ఇంకా వైరల్‌గానే ట్రైలర్
పద్మావతి ట్రైలర్ 50 మిలియన్ల వ్యూస్ దాటాయి. ఇంకా వైరల్ అవుతూనే ఉంది ఈ ట్రైలర్ అంటూ చిత్ర యూనిట్ ట్విట్టర్‌లో స్పందించింది. రణ్‌వీర్, దీపికా పదుకొనే, షాహీద్ కపూర్, అదితిరావు అకౌంట్లకు ట్యాగ్ చేశారు.

3డీ ఫార్మాట్‌లో పద్మావతి
ఇక వ్యూస్ సంగతి పక్కన పడితే పద్మావతి చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. యుద్ధ సన్నివేశాలకు ప్రేక్షకులు కొత్త అనుభూతిని కలిగించేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

3డీ చిత్రాలు రావడం అరుదు
బాలీవుడ్‌లో ఎక్కువగా 3డీ చిత్రాలు రావడం చాలా అరుదు. అప్పట్లో షారుక్ నటించిన రా.వన్ చిత్రం 3డీలో రూపొందింది. అలాంటిది పద్మావతిని 3డీ ఫార్మాట్‌లో తీసుకురావడంపై బాలీవుడ్ వర్గాలు కొంత ఆశ్చర్యానికి లోనవుతున్నాయి.

బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్
పద్మావతి చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అంటున్నాయి. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా పద్మావతి మిగిలిపోతుంది అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

డిసెంబర్ 1 రిలీజ్
దీపికా పదుకొనే, షాహీద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చాలా మంది హలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











