twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్ గారికి చట్టం తెలియదా? ‘పద్మావతి’ వివాదంపై పార్లమెంటు ప్యానల్ ఫైర్, ఆగిన రిలీజ్!

    By Bojja Kumar
    |

    ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావతి' మూవీ గొడవ పార్లమెంటు వరకు వెళ్లింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా తీశారని ఆందోళనలు రేకెత్తిన నేపథ్యంలో పార్లమెంటు ప్యానెల్ కలుగజేసుకుంది.

    'పద్మావతి' వివాదంపై చర్చించేందుకు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ గురువారం పార్లమెంట్‌ ప్యానెల్‌కు హాజరయ్యారు. ఈ ప్యానెల్‌కు సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషి కూడా వెళ్లారు.

     ఇలా చేయడం సెన్సార్ బోర్డును అవమానించడమే

    ఇలా చేయడం సెన్సార్ బోర్డును అవమానించడమే

    సినిమా సెన్సార్‌కు రాక ముందే మీడియాకు చూపించడంపై పార్లమెంటు ప్యానెల్ చైర్మన్ అనురాగ్ ఠాకూర్, సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి దర్శకుడు భన్సాలీపై ఫైర్ అయ్యారు. ఇలా చేయడం సెన్సార్ బోర్డును అవమానించడమే అని మండి పడ్డారు.

     డైరెక్టర్ గారూ.... మీకు చట్టం తెలియదా?

    డైరెక్టర్ గారూ.... మీకు చట్టం తెలియదా?

    సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఏదైనా మూవీకి సర్టిఫికెట్ ఇవ్వడానికి 68 రోజుల సమయం ఉంటుందని, ఈ విషయం మీకు తెలియదా అంటూ భన్సాలీని ప్యానెల్ ప్రశ్నించింది. నవంబర్ 11న సీబీఎఫ్‌సీకి సినిమా పంపి డిసెంబర్ 1న రిలీజ్ ఎలా ప్లాన్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

     చరిత్రకారులు పరిశీలించిన తర్వాతే క్లియరెన్స్

    చరిత్రకారులు పరిశీలించిన తర్వాతే క్లియరెన్స్

    చరిత్రకారులతో కమిటీని ఏర్పాటు చేశామని, వారు సినిమాను పరిశీలించాలని, ‘పద్మావతి' చిత్రానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి పార్లమెంటు ప్యానెల్‌కు తెలిపారు.

     గత్యంతరం లేకే అలా చేశానన్న భన్సాలీ

    గత్యంతరం లేకే అలా చేశానన్న భన్సాలీ

    పార్లమెంటు ప్యానెల్ ముందు భన్సాలీ స్పందిస్తూ... తనకు గత్యంతరం లేకనే సినిమాను మీడియాకు చూపించానని. సినిమాలో ఎలాంటి వక్రీకరణలు, తప్పడు సీన్లు లేవని నిరూపించుకోవడానికే ఇలా చేశానని వివరణ ఇచ్చుకున్నారు. కొద్ది మంది స్నేహితులకు, సీనియర్ జర్నలిస్టులకు మాత్రమే సినిమా చూపించానని తెలిపారు.

     కోట్ల రూపాయలు నష్టపోయాం

    కోట్ల రూపాయలు నష్టపోయాం

    పద్మావతి సినిమాపై ఆందోళనలు జరుగడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, ఈ కారణంగా కోట్ల రూపాయలు వృధాఅయ్యాయని భన్సాలీ పార్లమెంటు ప్యానెల్ ముందు వాపోయారు.

     ఫిక్షనల్ పాత్రలే అంటున్న భన్సాలీ, అసలు పేర్లు ఎందుకంటూ ప్యానెల్ ప్రశ్న

    ఫిక్షనల్ పాత్రలే అంటున్న భన్సాలీ, అసలు పేర్లు ఎందుకంటూ ప్యానెల్ ప్రశ్న

    ‘పద్మావతి' చిత్రాన్ని తాను ఫిక్షనల్ పాత్రలతో తెరకెక్కించానని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్యానెల్ ముందు వాదించారు. అయితే ఫిక్షనల్ పాత్రలతో సినిమాలు తీసినపు అసలు పేర్లను వాడాల్సిన అవసరం ఏమిటని ప్యానెల్ ప్రశ్నించింది.

     ఎల్ కె. అద్వానీ మద్దతు

    ఎల్ కె. అద్వానీ మద్దతు

    ‘పద్మావతి' సినిమా వివాదం నేపథ్యంలో పార్లమెంటు ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న భాజపా అగ్ర నేత ఎల్‌.కె అద్వానీ దర్శకుడు భన్సాలీకి మద్దతు పలికినట్లు సమాచారం. డైరెక్టర్‌ను ఇలా ప్రశ్నలతో వేధించడం మన ఎజెండాలో లేదంటూ వారించారట.

     రిలీజ్ డేట్ త్వరలో వెల్లడిస్తాం

    రిలీజ్ డేట్ త్వరలో వెల్లడిస్తాం

    ‘పద్మావతి' సినిమాపై వివాదం ఎటూ తేలక పోవడంతో ఈ రోజు (డిసెంబర్ 1)న విడుదల కావాల్సిన సినిమా ఆగిపోయింది. సినిమా విడుదల ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని భన్సాలీ తెలిపారు. సెన్సార్ క్లియర్ కాకుండా విదేశాల్లోనూ సినిమా విడుదల చేయబోమని భన్సాలీ తెలిపారు.

    English summary
    Padmavati movie director Sanjay Leela Bhansali and Prasoon Joshi appear before Parliamentary Panel. According to a report by PTI, Sources said the members of the panel asked him, “How could you assume that the movie could be released on December 1 when you applied to the CBFC on November 11. As per the cinematography act, the CBFC may take 68 days before certifying a movie?”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X