టాప్ లిరిసిస్ట్ నిజ స్వరూపం బయటపెట్టిన చిన్మయి తల్లి!
ఇండియా వ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఉధృతం కావడంతో ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తనకు ఎదురైన లైంగిక వేధింపుల అంశంపై స్పందించారు. ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తు కోరిక తీర్చమని వేధించాడంటూ ఆమె ఆరోపించారు.
వైరముత్తుపై వరుస ట్వీట్లు చేసిన చిన్మయి... స్విట్జర్లాండ్‌లో మ్యూజిక్ కాన్సెర్ట్ జరుగుతుండగా కాంప్రమైజ్ కావాలని ఆర్గనైజర్లతో తనపై ఒత్తిడి తెప్పించారని, తాను నిరాకరించడంతో నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించిన విషయం బయట పెట్టడం సంచలనం అయింది. తనతో పాటు చాలా మంది సింగర్లను వైరముత్తు వేధించిన విషయాన్ని చిన్మయి బయటపెట్టారు.
తాజాగా ఈ సంఘటన గురించి చిన్మయి తల్లి టి. పద్మహాసని స్పందించారు. 2005లో శ్రీలంకకు చెందిన తమిళులు ఆర్గనైజ్ చేసిన మ్యూజిక్ కాన్సెర్టులో తన కూతురుకు ఈ చేదు అనుభవం ఎదురైందన్నారు.

'నా కూతురు అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెను కాపాడుకోవాలనుకున్నాను. వెంటనే వైరముత్తు మేనేజర్‌తో మాట్లాడి చిన్మయిని వెంటనే ఇండియాకు పంపాలని డిమాండ్ చేసినట్లు పద్మహాసిన గుర్తు చేసుకున్నారు.
ఒక సింగిల్ పేరెంట్‌గా చిన్మయిని పెంచిన పద్మహాసిని చిన్న తనంలోనే ఆమెకు కర్నాటక సంగీతం శిక్షణ ఇప్పించారు. ఏ విషయంలో అయినా చిన్మయికి తన మద్దతు ఉంటుందని, ప్రతి ఒక్కరూ #మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె కోరుతున్నారు.
అయితే తమిళ సినీ పరిశ్రమ నుండి అతి కొద్ది మంది మాత్రమే చిన్మయికి మద్దతు తెలిపారు. దీనిపై పద్మహాసిని స్పందిస్తూ ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదని, అతడు ఇండస్ట్రీలో పెద్ద పేరు వ్యక్తి కాబట్టి మాకు మద్దతు ఇవ్వడానికి చాలా మంది భయపడుతున్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications











