నాని ‘పైసా’ ఆడియో రిలీజ్ పోస్టర్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం నాని హీరోగా 'పైసా' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్, సిద్ధిక శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈచిత్రం ఆడియో విడుదల తేదీ ఖరారైంది. మే19న ఆడియో రిలీజ్ వేడుక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో చిత్రం విడుదల తేదీ కూడా ఖరారు కానుంది.
ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్దవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట.
ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతోందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే.... మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఎల్లోఫ్లవర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











