twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘A’ సర్టిఫికేట్ పై ...హీరో నాని జోక్

    By Srikanya
    |

    హైదరాబాద్: మొత్తానికి కృష్ణవంశీ 'పైసా' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ జరిగి 'A'(పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ తో ఎడిటింగ్ టేబుల్ నుంచి బయిట పడింది. ఈ విషయమై హీరో చాలా హ్యాపీగా ఉన్నాడు. నాని జోక్ చేసి మాట్లాడుతూ... " స్కూల్ ల కూడా ఎప్పుడూ నాకు A రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ A మా అమ్మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు ," అన్నాడు.


    నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. హవాలా మనీ చుట్టూ కథ తిరుగుతుంది. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ట్రాన్సిక్షన్ లోకి లాగబడతాడు. అక్కడ నుంచి వచ్చే సమస్యలతో కథ,కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

    కృష్ణ వంశీ మాట్లాడుతూ.... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

    English summary
    Paisa starring Nani has finally got certified by the Censor Board. The film has received an ‘A’ certificate. Nani is happy that the film has finally got clearance. He said that he is extremely elated that the film got an A. "Never got A even in school. So my parents would be happy now," he joked!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X