ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాల వివరాలు!
హైదరాబాద్: సంక్రాంతికి విడుదలైన '1 నేనొక్కడినే', 'ఎవడు' చిత్రాలు జనవరి నెల చివరి వరకు థియేటర్లలో తిష్టవేసి ప్రస్తుతం జెండా ఎత్తేసిన సంగతి తెలిసిందే. అత్యధిక థియేటర్లు ఆక్రమించిన ఈ రెండు చిత్రాలు ఎత్తేసిన తర్వాత గానీ వేరే సినిమాల విడుదలకు అవకాశం లేని పరిస్థితి.
గత వారం 'హార్ట్ ఎటాక్', 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాలు విడుదల కాగా.....ఈ వారం మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 7న నాని హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా' చిత్రంతో పాటు శ్రీకాంత్ నటించిన 'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో', 'దిల్ దివానా' చిత్రాలు విడుదల అవుతున్నాయి.

కృష్ణ వంశీ దర్శకత్వంలో నాని, కేథరిన్ హీరో హీరోయిన్లు తెరకెక్కిన 'పైసా' చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి రమేష్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలతో విడుదల లేటవుతూ వచ్చింది.
శ్రీకాంత్, మనోచిత్ర జంటగా ఉదయ్ రాజు దర్శకత్వంలో మల్లెల సీతారామరాజు నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టెనర్ 'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో'. ఈ నెల 7న విడుదల అవుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలెట్ కానుంది. రఘురాం సంగీతం అందించిన ఈచిత్రానికి భాస్కరభట్ల లిరిక్స్ అందించారు.
తుమ్మ కిరణ్ దర్శకత్వంలో రాజారెడ్డి నిర్మించిన చిత్రం 'దిల్ దివానా'. రొమాంటిక్ జేనర్లో తెరకెక్కిన ఈచిత్రంలో అర్జున్ రెడ్డి, రోహిత్ రెడ్డి, అభా సింఘాల్, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా నటించారు. నాగబాబు, ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











