‘ప్ర’కాష్ గా హీరో నాని
హైదరాబాద్: కృష్ణవంశీ ప్రస్తుతం నాని హీరోగా 'పైసా' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని పేరు ప్రకాష్. అతను ప్ర...కాష్ అని విడతీసి..క్యాష్ అనే అర్దం వచ్చేటట్లు పలుకుతూంటాడు. ఆ యాక్సెంట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ చిత్రంలో కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ పాటల చిత్రీకరణలో తన క్రియేటివిటీ చూపిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే.... మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఎల్లోఫ్లవర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో 'పైసా' టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.


Click it and Unblock the Notifications











