twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐనాక్స్ లో ‘పైసా’ పైరసీ చేస్తూ..(ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాని హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని విడుదలైన రోజే పైరసీ చేస్తూ మనోజ్ అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కాచిగూడలోని ఐనాక్స్ థియేటర్లో సోనీ హై డెఫినెషన్ కెమెరాతో రికార్డు చేస్తూ మనోజ్ పట్టుబడ్డాడు.

    విశ్వసనీయ సమాచారం అందుకున్న వీడియో పైరసీ సెల్ అధికారులు. సుల్తాన్ బజార్ ఇన్స్ స్పెక్టర్ డి. వెంకట్ రెడ్డి అండ్ టీం మనోజ్ ను రెడ్డ హ్యాండెడా గా పట్టుకున్నారు. మనోజ్ ఇలా సినిమాలు రికార్డు చేసి గుంటూరులోని పూర్ణ చందర్ రావుకు పంపిస్తాడని తెలిసింది.

    Paisa pirate arrested while recording

    మనోజ్ కుమార్ పై కాపీరైట్ యాక్ట్ 1957, 66(ఎ), ఐటీ టెక్నీలజీ యాక్ట్ 2000 & 420 ఐపిసి 511,63&52 - ఎ(2) ఆర్/డబ్ల్యు 68(ఎ) కింద కేసు నమోదు చేసారు. గుంటూరుకు చెందిన పూర్ణ చందర్ రావుతో పాటు వీరి వెనక ఉన్న పైరసీ రాకెట్ మొత్తాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

    ఇటీవల విడుదలైన మహేష్ బాబు '1 నేనొక్కడినే', రామ్ చరణ్ నటించని ఎవడు, నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల, పూరి జగన్నాథ్-నితిన్ కాంబినేషన్లో వచ్చిన హార్ట్ ఎటాక్, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలను కూడా మనోజ్ విడుదల రోజు తన కెమెరాలో రికార్డు చేసి పైరసీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

    English summary
    Paisa movie was released worldwide on 7th feb 2014. A guy was arrested for illegally recording the movie, he recorded the whole movie with Sony HD camera. Anti video piracy cell is regularly monitoring the activities of pirates and caught him at INOX Cinemas, Kachiguda. Reports say that Manoj Kumar was supplying the print to Purna Chander Rao who residence in Guntur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X