వినోదాత్మకంగా పైసాలో పరమాత్మ
పైసాలోనే పరమాత్మ ఉన్నాడని భావించేవారూ, పైసాలు పోగేస్తే అవి మనల్ని పోషిస్తాయని నమ్మేవారూ మనలోనే చాలామంది ఉన్నారు. అదే థీమ్‌గా దర్శకుడు సాగర్ ఒక చిన్న బడ్జెట్ చిత్రం రూపొందిస్తున్నారు. రాజీవ్ కనకాల, బాలాదిత్య హీరోగాలు మౌనిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది.
పైసాలో పరమాత్మ చిత్రంలో ప్రతి పాత్ర డబ్బు కోసం తాపత్రయపడుతుంటుంది. డబ్బే అందరినీ నడిపిస్తుంటుంది. అందులోనే పూర్తి వినోదం అందుతుంది కూడా. ఇందులో పాత్రలు తప్ప నటీనటులు కనిపించరు అని చెప్పారు దర్శకుడు సాగర్. ఇంతవరకూ తాను యాక్షన్ చిత్రాల్నే రూపొందించానని, అయితే మొదటిసారి పూర్తి వినోదం పండించే చిత్రం చేస్తున్నానని చెప్పారు.
సాగర్ సినిమా పతాకంపై వి. చంద్రశేఖరరెడ్డి, వి. రాజశేఖర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డి.టి.యస్. వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. చక్కని ప్లానింగ్‌తో, తక్కువ సమయంలో అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయగలిగామని నిర్మాతలు చెప్పారు.
నవంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన వి. చంద్రశేఖరరెడ్డి తెలిపారు.
ఇంకా ఈ చిత్రం ఐశ్వర్య, నరేశ్, ఎమ్మెస్ నారాయణ, ఆలీ, జీవా, అభినయశ్రీ, అనంత్, వల్లభనేని, చిట్టిబాబు, నర్సింగ్‌యాదవ్, కాదంబరి కిరణ్, భరణి శంకర్, రాంబాబు, వెల్లంకి, మాణిక్, జ్యోతివర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: వేగ్నేశ సతీశ్, పాటలు: అనంత్ శ్రీరామ్, సంగీతం: లలిత్ సురేశ్, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: బాబ్జీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాగర్.


Click it and Unblock the Notifications