»   » అలనాటి అందాల నటి ఆసుపత్రిలో అనాధలా, కన్న పిల్లలే వదిలేసారు

అలనాటి అందాల నటి ఆసుపత్రిలో అనాధలా, కన్న పిల్లలే వదిలేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ హిట్ హిందీ చిత్రం 'పాకీజా' నటి గీతా కపూర్, ఇప్పుడు ఓ ఆసుపత్రిలో అనాధలా మిగిలారు. ఏప్రిల్ 21న ఆమె రక్తపోటుతో బాధపడుతుండగా, స్వయంగా ఆసుపత్రికి తీసుకువచ్చిన ఆమె కుమారుడు రాజా కపూర్, డబ్బులు తీసుకు వస్తానని చెప్పి బయటకు వెళ్లి, అప్పటి నుంచి రాకపోగా, ఆమె నేపథ్యం, దీనస్థితికి జాలిపడ్డ ఆసుపత్రి వైద్యులు వైద్యం కొనసాగిస్తున్నారు.

పాకీజా లో నటించి

పాకీజా లో నటించి

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పాకీజా మూవీ లో నటించి మంచి గుర్తింపు పొందింది..ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి తనకంటూ అబిమానులను సొంతం చేసుకుంది..ప్రస్తుతం కడుపున పుట్టిన పిల్లలే ఆమెను నడి రోడ్డు మీద వదిలేసారు. ముంబైలోని గోరెగావ్ అనే ప్రాంతంలో ఉండే గీతా క‌పూర్ (58)కి గ‌త ఏప్రిల్ 21వ తేదీన అస్వ‌స్థత క‌లిగింది.

లోబీపీకి గురైంది

లోబీపీకి గురైంది

ఆమె లోబీపీకి గురైంది. దీంతో ఆమె కొడుకు స్థానికంగా ఉన్న ఎస్ఆర్‌వీ హాస్పిట‌ల్‌కు ఫోన్ చేసి ఆంబులెన్స్ కావాల‌ని అడిగాడు. హాస్పిట‌ల్ వారు వెంట‌నే అత‌ని ఇంటికి ఆంబులెన్స్ పంపించారు. దీంతో అత‌ను త‌న త‌ల్లిని హాస్పిట‌ల్‌కు చేర్చాడు. అయితే హాస్పిట‌ల్ వారు కొంత డ‌బ్బును అడ్వాన్స్‌గా క‌ట్ట‌మ‌న్నారు.

గదిలో బంధించి

గదిలో బంధించి

అందుకు స‌రే అన్న అత‌ను ఏటీఎంకు వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి బ‌య‌ట‌కు వెళ్లాడు. అలా వెళ్లిన అత‌ను ఇప్ప‌టికి నెల దాటినా ఇంకా రాలేదు. కొడుకు తనపై ఎంతో నిర్దయగా ప్రవర్తిస్తుండే వాడని, ఓ గదిలో బంధించి, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవాడని ఆమె ఆరోపించారు.

గీత కుమార్తె పూజ

గీత కుమార్తె పూజ

కాగా, ఆమెను బయటకు పంపలేని స్థితిలో ఉన్న ఆసుపత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గీత కుటుంబ సభ్యుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. గీత కుమార్తె పూజకు పోలీసులు ఫోన్ చేయగా, ఆమె రాంగ్ నంబర్ అంటూ ఫోన్ పెట్టేసినట్టు తెలుస్తోంది.

వేరే చోటుకి మారాడ‌ు

వేరే చోటుకి మారాడ‌ు

ఈ క్ర‌మంలో ఆ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం గీతా క‌పూర్ అంగీకారం మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె కొడుకును వెతికి ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. అయితే ఆమె హాస్పిట‌ల్‌లో చేరిన‌ప్పుడు నివాసం ఉన్న గోరెగావ్‌లో అత‌ను లేడ‌ట‌. వేరే చోటుకి మారాడ‌ట‌.

హాస్పిట‌ల్‌లో చేరిన 4 గంట‌ల్లోపే

హాస్పిట‌ల్‌లో చేరిన 4 గంట‌ల్లోపే

గోరెగావ్‌లో అత‌ని నివాసం చుట్టు ప‌క్క‌ల వారు పోలీసుల‌కు అదే చెప్పారు. గీతా క‌పూర్ హాస్పిట‌ల్‌లో చేరిన 4 గంట‌ల్లోపే ఇంటికి వ‌చ్చి హ‌డావిడిగా ఇల్లు ఖాళీ చేశాడ‌ట అత‌ను. అత‌నికి ముంబైలోని అంధేరిలో 4 బంగ‌ళాలు ఉన్నాయ‌ని, అయిన‌ప్ప‌టికీ గోరెగావ్‌లో అలా ఇల్లు అద్దెకు తీసుకుని ఎందుకు ఉన్నాడో తెలియ‌ద‌ని పోలీసులు చెబుతున్నారు.

కూతురు కూడా ఉంది

కూతురు కూడా ఉంది

వృత్తి రీత్యా కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసే గీతా క‌పూర్ కొడుకు త‌న త‌ల్లిని వ‌దిలించుకోవ‌డం కోస‌మే ఇలా చేసి ఉంటాడ‌ని వారు భావిస్తున్నారు. కాగా గీతా క‌పూర్‌కు ఓ కూతురు కూడా ఉంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈ విషయం కొన్ని వార్తా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సభ్యుడు అశోక్ పండిట్ వెళ్లి గీతాకపూర్ దవాఖాన బిల్లు చెల్లించారు.

ఒక్కరే అన్న విషయం తెలియదు

ఒక్కరే అన్న విషయం తెలియదు

ముంబై గోరెగావ్ దవాఖానలో గీతాకపూర్ అనే మహిళను చికిత్స మధ్యలో కన్న కొడుకు వదిలేసి వెళ్లిపోయాడని దినపత్రికల్లో వచ్చింది. నేను దవాఖానకు బిల్లు చెల్లించడానికి వచ్చాను. ఈ గీతాకపూర్ పాకీజా సినిమాలోని గీతా కపూర్ ఒక్కరే అన్న విషయం నాకు తెలియదు అని తెలిపారు.

English summary
In a tragic incident of sorts, 'Pakeezah' actress Geeta Kapoor has been left abandoned in a city hospital by her son after being initially admitted by him on April 21.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu