అక్షయ్ కుమార్ చిత్రాన్ని నిషేదించిన పాకిస్థాన్
ముంబై: అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వం వహించిన సినిమా 'బాబీ'. ఇదొక యాక్షన్ అండ్ స్పై థిల్లర్ మూవీ. టెర్రరిస్టులను పట్టుకునే ఇండియన్ గూడాచారికి సంబంధించిన సినిమా కథ కావడంతో ఈ సినిమాపై పాకిస్తాన్ నిషేదం విధించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, కరాచీలోని సెన్సార్ బోర్డులు ఈ సినిమా చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్ పత్రికి ‘ది డాన్' పేర్కొంది.
కేవలం సినిమాపై మాత్రమే కాదు....సిడీలు, డీవీడీలపై కూడా నిషేదం విధించారు. అయితే ఈచిత్రం పాకిస్థాన్‌కు ఏ మాత్రం వ్యతిరేకం కాదని దర్శకుడు నీరజ్ పాండే వెల్లడించారు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ఏక్ థా టైగర్' చిత్రాన్ని కూడా పాకిస్తాన్ నిషేదించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రత్యేక అధికారి పాత్రలో నటించారు. 'మొదట ఈ కథ వినప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. తర్వాత బాబీ పేరు ప్రాధాన్యం అర్థమైంది. ఇందులో ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ ఉంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేశారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ అధికారిగా నటిస్తున్నా' అని అక్షయ కుమార్ తెలిపారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన 'బాబీ'లో అనుమప్ ఖేర్, దగ్గుబాటి రానా, తాప్సీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











