మళ్లీ పాకిస్తాన్ సినిమా
భారత్ లో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా ఉత్సవంలో పాకిస్తాన్ సినిమా మళ్లీ ప్రదర్శనకు నోచుకుంది. గోవాలో జరుగుతున్న 38వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2007లో ఖుదా కేలియే సినిమా కాంపిటీషన్ సెక్షన్ లో చోటుచేసుకుంది. ఈ విభాగంలో 12 దేశాలు పోటీ పడుతున్నాయి. కాగా ఖుదా కేలియే సినిమా సంప్రదాయవాదుల నమ్మకాలు ఆధారంగా రూపొందింది. ఈ విభాగంలో సమీర్ చంద్ర బెంగాళీ చిత్రం ఎక్ నదీర్ గల్పో(టేల్ ఆఫ్ ఎ రివర్) లెనిన్ రాజేంద్రన్ మలయాళ సినిమా రత్రి మజా(నైట్ రెయిన్) కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











