నమ్మక ద్రోహం: పాక్ నటి మిషీ ఖాన్‌పై క్రిమినల్ కేసు
రావల్పిండి: ప్రముఖ పాకిస్థాన్ నటి, టీవీ వ్యాఖ్యాత అయిన మిషీ ఖాన్‌పై బుధవారం క్రిమినల్ కేసు నమోదైంది. నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
ఓ మహిళా డాక్టర్ తమ ఆస్పత్రి ప్రచారం కోసం గత జూలైలో మిషీ ఖాన్‌కు రూ. 4,50,000 చెక్కు ఇచ్చారు.

అయితే, ఆ డబ్బులు తీసుకున్న మిషీ ఖాన్ తమకు ఎలాంటి ప్రచారం చేయలేదని, తనను మోసం చేశారని సదరు వైద్యురాలు కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుపై అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి కోర్టు విచారణ జరుపుతోందని పాకిస్థాన్ పత్రిక ‘డాన్' తన కథనంలో వెల్లడించింది. మిషీ ఖాన్‌పై చేసిన ఆరోపణలను ఆమె తరపు న్యాయవాది కొట్టిపారేశారు.


Click it and Unblock the Notifications











