Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కామెంట్ ప్లీజ్: పాకిస్థానోళ్లు... మన సినిమాల్లో జెండా పాతేస్తున్నారు!
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అటు బార్డర్లో ఎప్పుడు చూసిన ఉద్రిక్త పరిస్థితి...రాజకీయంగా ఎన్నో వివాదలు. అయితే సినిమా రంగానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పలువురు పాకిస్తాన్ స్టార్స్ బాలీవుడ్లో పాగా వేయడానికి క్యూ కడుతున్నారు. అఫ్ కోర్స్ కళకు ప్రాంతం, కులం, జాతి అనేబేధాలు ఉండవనుకోండి. మరి ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో తెలియజేయండి. అంతకంటే ముందుగా పాకిస్తాన్ నుండి వచ్చి బాలీవుడ్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న స్టార్ల వివరాలపై ఓ లుక్కేద్దాం...
ఇండియన్ సినీ పరిశ్రమ బాలీవుడ్ తో పోలిస్తే పాకిస్థాన్ లో సినీ పరిశ్రమ చాలా వెనకబడే ఉంది. పాకిస్థాన్లో ఎక్కువ మంది బాలీవుడ్ ఫాలోవర్సే. మన స్టార్లు నటించిన సినిమాలు అక్కడ బాగా ఆడుతాయి. దీంతో పాకిస్థాన్లోని స్టార్స్ కూడా బలీవుడ్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
పాకిస్థాన్ నుండి వచ్చి బాలీవుడ్లో మోస్ట్ వాటెండ్ గా మారిన నటుల్లో ఫావద్ ఖాన్ ఒకరు. కరాచి నుండి వచ్చిన ఇతడు బ్రలియంట్ యాక్టింగ్ స్కిల్స్, గుడ్ లుకింగ్ ఉండటంతో బాలీవుడ్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
అతని తొలి సినిమా సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఖూబ్ సూరత్. ఈ సినిమాకుగాను ఫావద్ ఖాన్ ఫిల్మ్ పేర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఇలాంటి అవార్డు దక్కించుకున్న తొలి పాకిస్థాన్ యాక్టర్ కూడా ఇతడే. కరణ్ జోహార్ మూవీ 'కపూర్ అండ్ సన్స్' సినిమాలో గే క్యారెక్టర్లో నటించి ఆకట్టుకున్నాడు.
పాకిస్థాన్ నుండి వచ్చి బాలీవుడ్లో రానిస్తున్న మరో యాక్టర్ అలి జఫర్. ఫవాద్ ఖాన కంటే ముందే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇతగాడు బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. బాలీవుడ్లో తెరే బిన్ లాడెన్, లండన్ పారిస్ న్యూయార్క్, మేరి బ్రదర్ కి దుల్హన్, ఛష్మే బద్దూర్, కిల్ దిల్ లాంటి చిత్రాల్లో నటించాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. త్వరలో షారుక్-అలియా జంటగా నటిస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాపై అలి జఫర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
పాకిస్థాన్ నటి మహిరా ఖాన్... షారుఖ్ ఖాన్ మూవీ 'రాయిస్'లో నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమెతో పాటు మీకల్ జుల్ఫికర్, మావ్రా హోకెన్, సారా లోరెన్ లాంటి పలువురు పాకిస్థాన్ స్టార్లు బాలీవుడ్లో తమ లక్కు పరీక్షించుకుంటున్నారు. స్లైడ్ షోలో వారికి సంబంధించిన వివరాలు..

ఫావద్ ఖాన్
పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ఫావద్ ఖాన్ బాలీవుడ్లో అడుగు పెట్టి మంచి డిమాండ్ ఉన్న యాక్టర్ గా మారిపోయాడు. పెర్ఫార్మెన్స్ పరంగా, లుక్స్ పరంగా ఆకట్టుకుంటుండటంతో మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇమ్రాన్ అబ్బాస్
పాకిస్థాన్ టీవీ యాక్టర్ ఇమ్రాన్ అబ్బాస్ బిపాషా బసు నటించిన క్రియేటర్ 3డి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.

మహిరా ఖాన్
పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. షారుక్ ఖాన్ మూవీ ‘రాయిస్'లో నటిస్తోంది.

మావ్రా హోకెన్
పాకిస్థాన్ టీవీ ఆర్టిస్ట్ మావ్రా ఖాన్ బాలీవుడ్లో సనమ్ తేరీ కసమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇతర సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.

అలీ జాపర్
పాకిస్థాన్ నుండి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో అలీ జాఫర్ ఒకరు.

సారా లోరెన్
పాకిస్థాన్ నటి, మోడల్ సారా లోరెన్ ఇంతకు ముందు మర్డర్ 3లో నటించింది. ప్రస్తుతం రొమాంటిక్ ఫిల్మ్ ఇష్క్ క్లిక్ చిత్రంలో నటిస్తోంది.

హుమైమా మాలిక్
పాకిస్థాన్ నుండి బాలీవుడ్లో తన లక్కు పరీక్షించుకుంటున్న మరో నటి హుమైమా మాలిక్. ఇమ్రాన్ హష్మితో రాజ్ నట్వర్ లాల్ మూవీలో నటించింది.

జావెద్ షేక్
పాకిస్థాన్ కు చెందిన జావెద్ షేక్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. చాలా బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. షారుక్ ఓం శాంతి ఓం, రిషి కపూర్ నమస్తే లండన్, రణబీర్ తమషా చిత్రాల్లో నటించాడు.