»   » ఇండియన్ సినిమాలపై నిషేదం విధించిన పాకిస్థాన్ కోర్టు

ఇండియన్ సినిమాలపై నిషేదం విధించిన పాకిస్థాన్ కోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాహోర్: విదేశీ చిత్రాలు, సీరియల్స్, టీవీ షోలు, ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన కార్యక్రమాలు అక్కడి టీవీ ఛానల్స్‌‌లో ప్రసారం చేయడాన్ని నిషేదిస్తూ పాకిస్థాన్‌లోని లాహోర్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇకపై ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎగ్జిబిటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

భారత చలనచిత్రాలు మరియు టీవీ ధారావాహికలు పాకిస్తాన్ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దిగుమతి జరిగిందని ఆరోపిస్తూ.... పిటీషన్ దాఖలైన నేపథ్యంలో లాహోర్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీకి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 12లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Pakistani court stops airing of Indian, foreign films on TV

వాస్తవానికి పాకిస్తాన్లో బాలీవుడ్ సినిమాలకు, మన హిందీ సిరీయళ్లకు, టీవీ షోలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇది తట్టకోలేని లోకల్ మీడియా సంస్థలు వాటిని అడ్డుకునేందు అడ్డదారిలో వాటిని ప్రసారం కాకుండా ఇలా చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినా దీని వల్ల మనకు పోయేదేం లేదు...పాకిస్థాన్ ప్రజలే తమ ఇష్టమైన కార్యక్రమాలను చూసే అవకాశం కోల్పోతారు.

English summary
A Pakistani court has stopped the screening of foreign films, serials and television shows, especially Indian content, on the countrys TV channels, triggering panic and outrage among exhibitors and viewers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu