బాలీవుడ్‌లోకి మరో పాక్ బ్యూటీ
ముంబై: పాకిస్థాన్ భామలు ఈ మధ్య బాలీవుడ్లో పాగా వేసేందుకు తహ తహలాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నర్గీస్ ఫక్రి, వీణా మాలిక్ లాంటి వారు బాలీవుడ్లో అడుగుపెట్టి తమ అందాల ప్రదర్శనలతో బీభత్సం సృష్టిస్తుండగా...మరో భామ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది.
ఆమె పేరు మెహ్రీన్ షైద్. ఇప్పటికే ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగంలో రాణిస్తున్న ఈ బ్యూటీని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్ తన సినిమా ద్వారా భారతీయ వెండి తెరకు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ విఫయమై సంజయ్ మాట్లాడుతూ మెహ్రీన్ నాకు దాదాపు ఏడేళ్లుగా టచ్‌లో ఉంది. తన తర్వాతి చిత్రంలో మహ్రీన్‌ని హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు వెల్లడించాడు.
కొన్ని సంవత్సరాల నుంచి మెహ్రీన్‌కి బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నప్పటికీ...ఆమె తన మొదటి సినిమాపై కొన్ని అంచనాలు పెట్టుందని, తన చిత్రంలో చేయబోయే పాత్రపై ఆమె చాలా సంతృప్తిగా ఉందని సంజయ్ చెప్పుకొచ్చారు. మరి ఈ పాకిస్థాన్ బ్యూటీ బాలీవుడ్ తెరపై ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications
