షాకింగ్.. సోనాలి బింద్రే కిడ్నాప్‌కై కుట్ర పన్నిన పాక్ క్రికెటర్

Recommended Video

Shoaib Akhtar Carried Sonali Bendre's Photo In His Wallet

క్రికెటర్లు, సినిమా వాళ్లు ప్రేమాయణాలు నడపడం సాధారణమే. ఎంతో మంది క్రికెట్ ఆటగాళ్లు, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ మనం చూశాం. వీరిలో కొంతమంది పెళ్లి చేసుకొని ఒక్కటైతే మరికొంత మంది డేటింగ్ తోనే ఫుల్ స్టాప్ పెట్టేవారున్నారు. అయితే ఈ రెండిటికి భిన్నంగా పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ డిఫెరెంట్ యాంగిల్ లో హీరోయిన్ పై తనకున్న ప్రేమ సంగతులు చెబుతున్నాడు.

సోనాలి బింద్రే అంటే ప్రాణం.. ఆమె లేకుండా

సోనాలి బింద్రే అంటే ప్రాణం.. ఆమె లేకుండా

ఇప్పటికే చాలా సార్లు ఈ విషయాలు చెప్పిన పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి ఓపెన్ అయ్యాడు. అప్పట్లో హీరోయిన్ సోనాలి బింద్రే అంటే తనకు ప్రాణమని.. ఆమెను చూడకుండా బ్రతకలేనని చెప్పి సంచలనం సృష్టించిన షోయబ్.. ఈ సారి కూడా సేమ్ స్టోరీ చెబుతూ తెగ ఫీలై పోయాడు.

పర్సులోనే సోనాలీ ఫోటో

పర్సులోనే సోనాలీ ఫోటో

గత 20 ఏళ్ల క్రిందట వచ్చిన 'ఇంగ్లీష్ బాబు దేసీ మేమ్' అనే బాలీవుడ్ చిత్రంలో ఆమెను చూసి ఫ్లాట్ అయ్యానని, అప్పటి నుంచే ఆమెపై ప్రేమను పెంచుకున్నట్లు చెప్పారు షోయబ్. ఆ సినిమా తర్వాత నుంచి ఆమె ఫోటోను పర్సులో పెట్టుకొని తిరిగేవాడినని కూడా మరోసారి ఆయన గుర్తుచేసుకున్నారు.

ప్రేమను ఒప్పుకోకపోతే.. కిడ్నాప్

ప్రేమను ఒప్పుకోకపోతే.. కిడ్నాప్

చాలా సార్లు సోనాలీని కలిసి తన ప్రేమను వ్యక్త పర్చాలని అనుకున్నానని, ఒకవేళ సోనాలీ నా ప్రేమను నిరాకరించినా కిడ్నాప్ చేయాలనే భావన ఉండేదని షోయబ్ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. సోనాలీ అంటే నేటికీ పిచ్చి అని షోయబ్ అక్తర్ అన్నాడు. షోయబ్ ఇదివరకు కూడా ఇలా మాట్లాడినప్పటికీ.. సోనాలీ పట్ల మరోసారి ఈ రకంగానే రియాక్ట్ కావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేన్సర్ బారిన సోనాలీ

కేన్సర్ బారిన సోనాలీ

బాలీవుడ్, టాలీవుడ్ తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనాలీ.. గత కొన్ని సంవత్సరాలుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఈమె ఇటీవలే తిరిగి ఇండియా వచ్చింది. కేన్సర్ మహమ్మారి నుంచి సోనాలీ బయటపడాలని ఆశిస్తోంది ప్రేక్షకలోకం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X