»   » గాయని దారుణ హత్య.. గర్భిణిని పాయింట్ బ్లాంక్‌‌లో.. నదుటిపై కాల్చివేత

గాయని దారుణ హత్య.. గర్భిణిని పాయింట్ బ్లాంక్‌‌లో.. నదుటిపై కాల్చివేత

Posted By:
Subscribe to Filmibeat Telugu
గాయని దారుణ హత్య.. గర్భిణిని పాయింట్ బ్లాంక్‌‌లో.. నదుటిపై కాల్చివేత

పాకిస్థాన్‌లో ఓ గాయనిని అగంతకులు దారుణంగా కాల్చి చంపారు. సింధూ ప్రావిన్స్‌లోని కంగా గ్రామంలో ఓ సంగీత విభావరిలో పాల్గొన్న సమీనా సామూన్ దారుణ హత్యకు గురైంది. కిక్కిరిసిన జనం సందోహం మధ్య జరుగుతున్న కార్యక్రమంలో గాయనిని కాల్చి చంపడం సంచలనానికి దారి తీసింది. ఈ దారుణ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది.

ఆరు నెలల గర్భిణి

ఆరు నెలల గర్భిణి

దారుణ హత్యకు గురైన సింధూ ఆరు నెలల గర్భవతి అని పోస్టుమార్టంలో వైద్యులు నిర్ధారించారు. హత్యకు గురైన రెండు రోజుల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె మరణానికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

నిలబడి పాడనందుకు

నిలబడి పాడనందుకు

పాకిస్థానీ మీడియా కథనం ప్రకారం.. తారీఖ్ ఆహ్మద్ జటోయి అనే వ్యక్తి సమీనా సింధూను నిలబడి పాడమని కోరాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఇతరులు కూడా బలవంతం చేయడంతో ఆమె నిలబడటానికి ప్రయత్నించింది. అంతలోనే అడుగు దూరంలో ఉన్న సింధూ నుదుటికి పిస్టల్ గురిపెట్టి కాల్చాడు. పాయింట్ బ్లాంక్ దూరంలో కాల్చడంతో అక్కడికక్కడే మరణించింది.

 హోంశాఖ సీరియస్

హోంశాఖ సీరియస్

నిందితుడు తారిఖ్ ఆహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై సింధ్ హోంశాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలి అని హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

వీడియో క్లిప్పింగ్ వైరల్

వీడియో క్లిప్పింగ్ వైరల్

సింధూ హత్యపై పాకిస్థాన్‌లోని మానవ హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పాక్‌లోని మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ వీడియో క్లిప్స్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

రెండు హత్యలు జరిగాయి

రెండు హత్యలు జరిగాయి

సమీనా సింధూ మరణవార్తతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలి. సింధూతోపాటు ఆమె గర్భంలోని పసిబిడ్డను కూడా చంపాడు. అతడిపై రెండు హత్యలు నమోదు చేయాలి అని ప్రభుత్వాన్ని భర్త డిమాండ్ చేశారు.

English summary
A Pakistani singer was shot dead at a crowded musical event in Sindh province. Samina Samoon, 24, was performing in Kanga village on Tuesday evening. A video clip of Samina, who was six months pregnant, surfaced two days after the murder in public glare.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X