ఛీఛీ..సిగ్గుమాలిన జన్మ అంటూ చివాట్లు
పాకిస్థానీ భామ వీణా మాలిక్ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా, చేతిపై ఐఎస్ఐ టాటూ వేసుకుని ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్‌పై దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీణా మాలిక్ బరితెగింపుపై పాకిస్తాన్ లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెది సిగ్గుమాలిన జన్మ అంటూ ఫేస్ బుక్ లో ఆమెపై తిట్ట వర్షం కురిపిస్తున్నారు పాకిస్తానీలు. పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ....కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఇప్పడు ఆమె పాకిస్థాన్ వెళితే రాళ్లతో తరిమికొట్టే పరిస్తితులు ఉన్నాయట. పాపం పబ్లిసిటీ కోసం వీణా చేసిన న్యూడ్ ప్రయత్నం చివరకు ఆమెకు కష్టాలను తెచ్చిపెట్టిందంటూ మరికొందరు జాలి పడుతున్నారు.
ఇదిలా ఉంటే తన నగ్న పోటోను ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ కవర్ పేజీపై వాడటంపై వీణా మాలిక్ ఆ మ్యాగజైన్ కు నోటీసులు పంపింది. తన పరువుకు డ్యామేజ్ చేసినందుకు గాను రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications











