'పక్కా కమర్షియల్' టికెట్ రేట్స్ ఇవే.. దెబ్బకు దిగొచ్చిన సినిమా యూనిట్
వరుస పరాజయాలు అందుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్ సీటిమార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా వరుసగా అప్డేట్స్ వదులుతోంది ఈ సినిమా యూనిట్. ఇక ప్రస్తుతం అన్ని సినిమాల రేట్లు పెంచి అమ్ముతున్న నేపథ్యంలో పక్కా కమర్షియల్ సినిమాకు టిక్కెట్ల రేట్లు తగ్గుతాయని తెలుస్తోంది. తాజాగా అదే విధంగా అడివి శేష్ మేజర్ సినిమాకు కూడా టికెట్ల రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. విపరీతంగా పెరిగిన టిక్కెట్ల రేట్ల వల్ల పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా మొదటి రోజు నుంచి థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి.
దీంతో దర్శక నిర్మాతలు టికెట్ల రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీ వాసు ఈ సినిమా టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా 'పక్కా కమర్షియల్' టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని ఆయన అదే వేదిక మీదే ప్రకటించారు. ఇక ఆయన చెప్పినదాని ప్రకారం నైజాంలో ఈ సినిమాకి రూ.188.8 (జీఎస్టీ లేకుండా), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.177 (జీఎస్టీ లేకుండా), సింగిల్ స్క్రీన్‌లో రూ.112 (జీఎస్టీ లేకుండా)గా టికెట్ రేట్లు ఉంటాయి.

ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్ కాగా ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిందీ టీమ్. మొత్తం మీద ఈ సినిమా ఓటీటీ విడుదల కూడా ఇప్పట్లో ఉండదని అంటున్నారు. సినిమా విడుదలైన ఐదు వారాల తరువాతే ఈ సినిమాను ఓటీటీలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











