Pakka Commercial Trailer : మారుతి మార్క్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్!

చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ చివరిగా సిటీ మార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా హిట్ కాకపోయినా పర్వాలేదు అనిపించుకుంది.. అయితే ఎలాగైనా హిట్ కొట్టాలని ఇప్పుడైనా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఆయనకు సంబంధించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ యు.వి.క్రియేషన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ ల మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇక ఈ ట్రైలర్ మారుతి మార్కుతో ఆద్యంతం కనిపిస్తుంది. ట్రైలర్ ప్రకారం గోపీచంద్ అలాగే రాశి ఖన్నా ఇద్దరూ కూడా లాయర్లుగా పనిచేస్తూ ఉంటారు. గోపీచంద్ నిజాయితీపరుడైన మాజీ జడ్జి సత్య రాజ్ కుమారుడు అయితే తండ్రి నిజాయితీతో ఆస్తి సంపాదించక పోవడంతో డబ్బు కోసం ఎలాంటి కేసు అయినా ఒప్పుకుని నిందితులను సైతం నిర్దోషులుగా బయటకు తీసుకు వచ్చేంత పేరు సంపాదిస్తాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి అనూహ్యంగా సినిమా పిచ్చి గల రాశి కన్నా ఎంటర్ అవుతుంది. అయితే ఒక కేసు విషయంలో గోపీచంద్ కి సత్యరాజ్ కి మధ్య ధర్మ యుద్ధం మొదలవుతుంది. ధర్మం కోసం కొడుకు వాదిస్తున్న కేసుకు ప్రతివాదిగా వాదిస్తాడు సత్యరాజ్. ఇక ఈ ధర్మ యుద్ధంలో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు? అసలు కేస్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Pakka Commercial Trailer : interesting with maruthi mark

సినిమా ట్రైలర్ మొత్తం కూడా పూర్తిస్థాయిలో మారుతి మార్క్ కనిపిస్తుంది. రావు రమేష్ గెటప్, అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ ఇవన్నీ కలిస్తే సినిమా మొత్తం మీద ఆసక్తి పెరిగి పోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయడం కోసం టీమ్ మొత్తం కష్టపడుతోంది. ఇక ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద సినిమా మీద ట్రైలర్ ఆసక్తి పెంచడంతో ఈ సినిమా ఏ మేరకు ఉంటుందనే విషయం మీద కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంటుంది అనేది సినిమా విడుదల అయితే గాని చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X