పలాస 1978: సినిమా ఎలా సాగిపోయిందంటే.. ఫస్టాఫ్ ఇలా! సెకండాఫ్ అలా..
తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం 'పలాస 1978'. ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ రోజే (మార్చి 6) ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో సన్నివేశాలు ఎలా సాగిపోయాయి? ట్విస్టులు ఏంటి? ఆ వివరాలు చూద్దామా..

వాస్తవ సంఘటనల నేపథ్యంలో..
1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్ పొందిన ఈ మూవీలో
రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ముఖ్యపాత్రలు పోషించారు.

పలాసలో హత్య.. సీరియస్ సన్నివేశాలు
తమ్మారెడ్డి భరద్వాజ వాయిస్‌తో సినిమాను ప్రారంభించి ముందుగా పలాసలో జరిగిన ఓ హత్యను చూపించారు. చిత్ర ప్రారంభం నుంచే సీరియస్ సన్నివేశాలను చూపిస్తూ విలన్ రఘు కుంచె ఎంట్రీ, ఆ తర్వాత హీరో రక్షీత్, హీరోయిన్ నక్షత్ర ఎంట్రీ చూపించారు.

రక్షిత్ యాక్షన్.. రఘు కుంచె గేమ్ ప్లాన్
ఓ పాట, అనంతరం హీరో రక్షిత్ యాక్షన్ సన్నివేశాలు చూపిస్తూ కథను ముందు సాగించారు. విలన్ రఘు కుంచె గేమ్ ప్లాన్ స్టార్ట్ కావడం, వెనుకబడిన కులాల గొంతుక వినిపిస్తూ హీరో వెళ్లడం లాంటి సన్నివేశాలతో కథ అలా సాగిపోయింది.

ఫస్టాఫ్ రిపోర్ట్.. సీరియస్‌గా!
హీరోని అణగతొక్కేందుకు ధనిక వర్గాల ప్రయత్నాలు చూపిస్తూ విరామం ఇచ్చారు. మొత్తానికి ఫస్టాఫ్ సీరియస్‌గా సాగిపోతూనే సినిమాపై ఆసక్తిని పెంచేసింది. సెకండాఫ్ చూడాలనే ఆతృతను నింపింది.

హీరో కుటుంబంపై హత్యాయత్నం
ఇంట్రర్వెల్ తర్వాత కొన్ని కీలక సన్నివేశాలు చూపిస్తూ హీరో మరియు అతని కుటుంబంపై హత్యాయత్నం జరగడం చూపించారు. ఈ టైమ్ లో సినిమా రొటీన్‌గా అనిపిస్తూ కాస్త నెమ్మదిగా సాగిందనిపించింది.
Recommended Video


క్లైమాక్స్ దిశగా.. అలా క్లోజ్
ఆ తర్వాత హీరో తన ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, నిస్సహాయకుడిగా మారడం లాంటి సన్నివేశాలతో కథ క్లైమాక్స్ దిశగా వెళ్ళింది. చివరకు ఓ మంచి మెసెజ్‌తో సినిమా ముగించారు. మరింత వివరంగా సినిమా గురించి తెలియాలంటే మీరంతా థియేటర్స్‌కి వెళ్లాల్సిందే.


Click it and Unblock the Notifications











