ProjectK First Glimpse: అభిమానులను మోసం చేసిన 'ప్రాజెక్ట్ కె' టీమ్.. అంత హైప్ ఇచ్చి ఊసురుమనిపించారే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె' ఒకటి. పాన్ వరల్ట్ రేంజ్‌లో రానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇస్తానని ప్రకటించారు మేకర్స్. కానీ.. ఈ లోపలే ఏం జరిగిందంటే..

సినిమా అంతా స్టార్సే.. :యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే 'ప్రాజెక్ కె'. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటానీ సహా పలువురు స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Pan india star Prabhas Nag Ashwin Project k movie first glimpse title release date announced

షూటింగ్ ఎంత వరకు వచ్చిందంటే.. :ప్రాజెక్ట్ కె సినిమాను పాన్ వరల్డ్‌ రేంజ్‌తో తీస్తున్నారు. అధునాతన టెక్నాలజీతో భారీ విజువల్స్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఇప్పటివరకు దాదాపు 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తైంది. రీసెంట్ గా కమల్ హాసన్ కూడా సినిమాలో భాగమని ప్రకటించారు.

వరుసగా సర్ ప్రైజెస్.. :గత కొద్ది రోజులుగా ఈ మూవీటీమ్ వరుసగా సర్ ప్రైజెస్ లు ఇస్తోంది. రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపింది. దీంతో ఆ వేదికపై ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్న తొలి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్‌ కె చరిత్ర సృష్టించనుంది. ఈ నెల 20న ప్రారంభం కానున్న కామిక్‌ కాన్‌ - 2023 వేడుకల్లోనే సినిమా పేరు, ట్రైలర్‌ను ఆవిష్కరించి, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

Pan india star Prabhas Nag Ashwin Project k movie first glimpse title release date announced

ఫస్ట్ గ్లింప్స్.. :ఇకపోతే తాజాగా నేడు(జులై 14) రాత్రి 8 30 గంటలకు క్రేజీ అనౌన్స్ మెంట్ ఇస్తానని ప్రకటించారు మూవీ మేకర్స్. అయితే గంట 20 నిమిషాలు వేయు చేయించి ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచారు. ఆ తర్వాత సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు. జులై 20న యూఎస్ ఏ లో, 21న భారత్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అప్పటికే అసహనం వ్యక్తం చేసిన అభిమానులు మోశం చేశారంటూ కామెంట్లు పెట్టారు. ఆ తర్వాత ఈ అప్డేట్ చూసి కాస్త ఆనందం వ్యక్తం చేశారు.

Pan india star Prabhas Nag Ashwin Project k movie first glimpse title release date announced

రూ.500 కోట్లు పైగానే.. :ఇక ఈ చిత్రం మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన భారీ యాక్షన్ సన్నివేశాలు, అలాగే ప్రత్యేక వ్యూహాలతో కూడిన సన్నివేశాలను ఉంటాయని అంటున్నారు. అమితాబ్‌ బచ్చన్, ప్రభాస్ పాత్రను ఇతిహాస ఆధారిత అశ్వత్థామ, కల్కి పాత్రల స్ఫూర్తితో తీర్చిదిద్దనున్నారని సమాచారం. ఇకపోతే అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ హంగులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. రూ.500 కోట్లు పైగానే బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X