ProjectK Prabhas Look:'ప్రాజెక్ట్ కె' సర్‌ప్రైజ్... ఏందీ భయ్యా.. అవెంజర్స్ రేంజులో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ కె' ఒకటి. పాన్ వరల్ట్ రేంజ్‌లో రానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే...
స్టార్ హీరోలతో సినిమా: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే 'ప్రాజెక్ కె'. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హాట్ బ్యూటీ దిశా పటానీ సహా పలువురు స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

పాన్ వరల్డ్ సినిమా: ప్రాజెక్ట్ కె సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. అధునాతన టెక్నాలజీతో భారీ విజువల్స్ తో సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఇప్పటివరకు దాదాపు 60 శాతానికి పైగానే షూటింగ్ పూర్తైంది అని అంటున్నారు. రీసెంట్ గా కమల్ హాసన్ కూడా సినిమాలో భాగమని ప్రకటించారు.

ఫస్ట్ గ్లింప్స్: గత కొద్ది రోజులుగా ఈ మూవీటీమ్ వరుసగా సర్ ప్రైజెస్ లు ఇస్తోంది. రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక శాన్ డియాగో కామిక్ కాన్ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపింది. దీంతో ఆ వేదికపై ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్న తొలి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్ కె చరిత్ర సృష్టించనుంది. ఈ నెల 20న ప్రారంభం కానున్న కామిక్ కాన్ - 2023 వేడుకల్లోనే సినిమా పేరు, ట్రైలర్‌ను ఆవిష్కరించి, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇకపోతే ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్డేట్ కూడా ఇచ్చారు. జులై 20న యూఎస్ ఏ లో, 21న భారత్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఐరెన్ మ్యాన్ లా ప్రభాస్: ఇక తాజాగా ప్రభాస్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ మార్వెల్ హీరోలాగా సూపర్ గా ఉన్నాడు. చూస్తుంటే ఐరెన్ మ్యాన్ లా కనిపిస్తూ.. స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. హీరో అడుగుపెట్టాడు. ఇక ఆట మారబోతుంది.. అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే.. అవెంజర్ లా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ సూపర్ గా ఉన్నాడు అని వైరల్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో: ఇక ఈ చిత్రం మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన భారీ యాక్షన్ సన్నివేశాలు, అలాగే ప్రత్యేక వ్యూహాలతో కూడిన సన్నివేశాలను ఉంటాయని అంటున్నారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ పాత్రను ఇతిహాస ఆధారిత అశ్వత్థామ, కల్కి పాత్రల స్ఫూర్తితో తీర్చిదిద్దనున్నారని సమాచారం. ఇకపోతే అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ హంగులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. రూ.500 కోట్లు పైగానే బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











