ఆ చిత్రానికి 'అరుంధతి' కీ అస్సలు పోలికలేదు...అనుష్క
అరుంధతి చిత్రంతో స్టార్ గా ఎదిగిన అనుష్క తాజాగా పంచాక్షరి చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అరుంధతికి కార్బన్ కాపీలా తయారైందంటూ రూమర్స్ వినపిస్తున్నాయి. ఈ విషయమై అనుష్క స్పందిస్తూ.... పంచాక్షరి...అరుంధతి లాంటి చిత్రం కాదు. అరుంధతి పునర్జన్మ తో కూడిన ఓ రివేంజ్ డ్రామా అయితే పంచాక్షరి ఇద్దరు అమ్మాయిల సింపుల్ కథ..అంది. ఇక వి.సముద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో సామ్రాట్ అనే కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. నాగార్జున పర్శనల్ మేకప్ మేన్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతోంది. సముద్ర ఈ చిత్రానికి ముందు భూమికతో 'మల్లెపూవు', జగపతి బాబుతో 'అధినేత' చిత్రాలు రూపొందించారు. అనుష్క ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రంలోనూ, పవన్ కళ్యాణ్ సరసన లవ్ ఆజ్ కల్ రీమేక్ లోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











