దర్శకుడు కృష్ణవంశీ ఏబీలకన్నా ఎక్కువ
రాజమౌళి, వినాయక్, పూరి జగన్నాథ్, శంకర్ వీళ్ళందరూ 'ఎ' కేటగిరీ దర్శకులు. కృష్ణవంశీ ఏబీలకన్నా ఎక్కువే అంటున్నారు నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర). నాగార్జున పర్శనల్ మేకప్ మెన్ గా సుప్రసిద్దులైన చంద్ర రీసెంట్ గా అనుష్క ప్రధాన పాత్రలో 'పంచాక్షరి' చిత్రం రూపొందించారు. ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా దర్శకులు గురించి వ్యాఖ్యానించారు. అలాగే 'పంచాక్షరి'కి దర్శకుడుని ఎంపిక చేసిన విధానం చెబుతూ...ఈ చిత్రానికి కథ,కథనం,బడ్జెట్ అన్నీ సమకూరిన తర్వాత ఎవరు దర్శకత్వం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాం. రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడానికి నేను సరిపోను. ఎ, బి కేటగిరీ దర్శకులు వద్దు..కొత్త కుర్రాడైనా ఫర్వాలేదనిపించింది. అలా ఆలోచిస్తుండగా సముద్ర పేరు తట్టింది. మా బృందమంతా సముద్రకు ఓటేశారు. కథ నచ్చితేనే చేయమని సముద్రకి చెప్పాను. తనకు నచ్చింది. అనుకున్న బడ్జెట్ లో 53 రోజుల్లో తీసిపెట్టాడు. అందరం సంతోషంగా ఉన్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











