ఖాళీగా ఉండటమెందుకని కమిటియనట్లున్నాడు
హైదరాబాద్ : హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్లు కొట్టలేక వెనకబడ్డ ఆర్యన్ రాజేష్ ఖాళీగా ఉండటమెందకు అని సినిమాలు ఒప్పుకుంటున్నట్లున్నారు. తాజాగా ఓ దెయ్యాల చిత్రంతో ముందుకు రావటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సినిమా పేరే 'పంచముఖి'. అయితే ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ మాత్రమే హీరో కాదు. ఇంకా నలుగురు ఉన్నారు. అందులోనూ రాజేష్ ది ఒక ఎపిసోడ్ అని చెప్తున్నారు. అలాగే ఓ పాట కూడా ఇచ్చారట. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

నిర్మాత మాట్లాడుతూ ''కథను నమ్ముకొని తెరకెక్కించిన చిత్రమిది. సినిమాలో ఐదు కథలు, ఐదుగురు హీరోలు, ఐదు పాటలు ఉన్నాయి. ఐదుగురు సంగీత దర్శకులు పని చేశారు. ప్రతి కథకు మరో కథతో సంబంధముంటుంది'' అన్నారు. కార్యక్రమంలో మాదాల రవి, డి.ఎస్.రావు, కృష్ణుడు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











