twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖాళీగా ఉండటమెందుకని కమిటియనట్లున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్లు కొట్టలేక వెనకబడ్డ ఆర్యన్ రాజేష్ ఖాళీగా ఉండటమెందకు అని సినిమాలు ఒప్పుకుంటున్నట్లున్నారు. తాజాగా ఓ దెయ్యాల చిత్రంతో ముందుకు రావటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ సినిమా పేరే 'పంచముఖి'. అయితే ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ మాత్రమే హీరో కాదు. ఇంకా నలుగురు ఉన్నారు. అందులోనూ రాజేష్ ది ఒక ఎపిసోడ్ అని చెప్తున్నారు. అలాగే ఓ పాట కూడా ఇచ్చారట. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

    Panchamukhi First Look revealed
    దేవుడు ఉన్నాడా.. దెయ్యాలున్నాయా.. ఇలాంటి ప్రశ్నలు చాలా కాలం నుంచి వింటున్నాం. వీటికి విరుద్ధమైన సమాధానాలు కూడా వింటూ వచ్చాం. అలాంటి వాటిలోంచి ఓ సమాధానమే మా సినిమా అంటున్నారు చల్లా భాను కిరణ్‌. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పంచముఖి'. ఆర్యన్‌ రాజేష్‌, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్‌ ముఖ్య పాత్రధారులు. యార్లగడ్డ కిరణ్‌ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    నిర్మాత మాట్లాడుతూ ''కథను నమ్ముకొని తెరకెక్కించిన చిత్రమిది. సినిమాలో ఐదు కథలు, ఐదుగురు హీరోలు, ఐదు పాటలు ఉన్నాయి. ఐదుగురు సంగీత దర్శకులు పని చేశారు. ప్రతి కథకు మరో కథతో సంబంధముంటుంది'' అన్నారు. కార్యక్రమంలో మాదాల రవి, డి.ఎస్‌.రావు, కృష్ణుడు పాల్గొన్నారు.

    English summary
    
 "Panchamukhi" starring Aryan Rajesh, Krishnudu, Madhala Ravi, Chinna, Uttej, Yarlagadda Kiran and Suman directed by Challa Bhanu Kiran and produced by Yarlagadda Kiran under Art in Heart Creations banner First look is out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X