వినాయక్ క్లాప్: ‘పండగ చేస్కో’ షురూ (ఫోటోలు)
రామ్ హీరోగా యూనైటెడ్ మూవీస్ సమర్పణలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'పండగ చేస్కో'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా రానున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో శనివారం ఉదయం జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ కొట్టగా...ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేసారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. అనంతర దర్శకుడు మాట్లాడుతూ ఒక మంచి టైటిల్, కథతో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వెలిగొండ శ్రీనివాస్ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. కోన వెంకట్, అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించారు. బలుపు తర్వాత మంచి టెక్నీషియన్స్‌తో కలిసి చేస్తున్న ఈచిత్రం రామ్ అభిమానులకు నిజంగా పండగ అవుతుంది అన్నారు.
రామ్ ఎనర్జీకి తగిన విధంగా ఈ సినిమా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర కూడా చాలా ఎనర్జీతో ఉంటుంది. బ్రహ్మానందంగారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. థమన్, విల్సన్, గౌతం రాజు, రామ్ లక్ష్మణ్ లాంటి వారు పని చేస్తున్నారి తెలిపారు.

రామ్
గోపీచంద్ మలినేనితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందు కథలు విన్నాను కానీ చేయడం మిస్సయింది. నేను మిస్సయిన సినిమాల్లో బలుపు కూడా ఉంది అన్నారు. కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది అన్నారు.

నిర్మాత పరుచూరి ప్రసాద్
మంచి కథ కాబట్టే ఈ సినిమా చేస్తున్నాం. రైట్ టైమ్ లో, రైట్ స్క్రిప్టుతో, రైట్ యాక్టర్స్‌తో చేస్తున్న ఈ సినిమాపై మంచి మాకు మంచి అంచనాలు ఉన్నాయన్నారు.

థమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ...గోపీచంద్ మలినేనితో ఇది మూడో సినిమా. హిట్టవుతుందనే నమ్మకం ఉంది. కోన వెంకట్, అనిల్ రావి పూడి, వెలిగొండ శ్రీనివాస్ లాంటి వారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అన్నారు

వెలిగొండ శ్రీనివాస్
వెలింగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కథ రాసుకునేప్పుడే రామ్‌ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈ సినిమాలో రామ్ హీరోగా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డబ్బు సంపాదించడానికి చాలా మంది అనుబంధాలను విడిచి విదేశాలకు వెలుతుంటారు. అలాంటిది విదేశాల్లోని ఒక మిలియనీర్ ఇండియా వచ్చి ఏం చేసాడనేది ఈ సినిమా అన్నారు.

పండగ చేస్కో
"పండగ చేస్కో" చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సంగీతం: థమన్ ఎస్.ఎస్., సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పరుచూరి ప్రసాద్, నిర్మాత: పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.


Click it and Unblock the Notifications











