twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పండగ చేస్కో' ...దేని గొడవ దానిదే

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్ హీరో గా నటిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మాత. సినిమా చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో రామ్‌, సోనాల్‌, రకుల్‌పై చిత్రీకరించిన పాటతో షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న ఈ సమయంలో ఆడియో విడుదల తేదీని ప్రకటించారు. మే 1 వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదల కానుందని సమాచారం. రామ్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బందులు పెడుతున్నాడంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ వార్తకు ప్రాదాన్యత పెరిగింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఉన్న వూరుకు, కన్నవాళ్లకు దూరంగా విదేశాల్లో ఉంటూ నాలుగు డాలర్లు వెనకేసుకోవడం కంటే తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు ఆ యువకుడు. అలాంటి ఓ యువకుడి కథే మా చిత్రం అంటున్నారు రామ్‌.

    Pandaga Chesko’s audio release date confirmed

    ''కుటుంబ సమేతంగా చూసి పండగ చేస్కొనే సినిమా ఇది. రామ్‌ చురుకుతనం, రకుల్‌, సోనాల్‌ల అందచందాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. త్వరలో పాటల్ని విడుదల చేస్తామ''అంటున్నాయి చిత్రవర్గాలు.

    ఈ చిత్రంలో రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని.

    Pandaga Chesko’s audio release date confirmed

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

    రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

    English summary
    Makers of Ram’s upcoming film Pandaga Chesko are planning to release the audio of the film on May 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X