‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం జనవరి 31న విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారం ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బ్రిలియంట్ కలెక్షన్స్ సాధించింది. పూర్తి వినోదాత్మకంగా సాగుతూ...థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరిని సంతృప్తి పరుస్తుండటం సినిమాకు బాగా ప్లస్సయింది.
'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రానికి విడుదలైన తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రివ్యూలు కూడా అనుకూలంగా వచ్చాయి. మౌత్ టాక్ కూడా సూపర్ అనే విధంగా ఉండటంతో వీకెండ్‌లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్రహ్మాండమైన బిజినెస్ చేసింది. వీక్ డేస్ కావడంతో అయితే సోమవారం నుండి మాత్రం కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి. తొలి వారం ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీసు వద్ద దాదాపు రూ. 25.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిందని. ఇందులో రూ. 11.50 కోట్ల నెట్ కలెక్షన్ అని తెలుస్తోంది.
ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టనెర్ మూవీ ఇండియాతో పాటు నార్త్ అమెరికా, యూరఫ్, యుకె, కువైట్, ఆఫ్రియా ప్రాంతాల్లో కూడా విడుదలైన మంచి విజినెస్ చేసింది. ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద రూ. 1.06 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిననట్లు తెలుస్తోంది. దీంతో ఈచిత్రం టోటల్ నెట్ కలెక్షన్ 12.56 కోట్లుకు చేరుకుందని ట్రేడ్ సమాచారం.
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహించారు.
ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications












