నెక్ట్స్ ఎలక్షన్లో ఓటేయడానికి ఫింగర్ ఉండదు: అలీ మరో సెన్సేషన్
బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టిన అలీ... టాలీవుడ్లో టాప్ కమెడియన్‌గా ఎదిగారు. హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన కామెడీ పాత్రలకే పరిమితం అయ్యారే తప్ప హీరోగా సినిమాలు చేయడం లేదు. చాలా కాలం తర్వాత అలీ హీరోగా సినిమా రాబోతోంది.
'పండుగాడి ఫోటోస్టూడియో' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో అలీ చెప్పిన కొన్ని రాజకీయ డైలాగులు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

రాజకీయాల్లో చురుకుగా అలీ
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీ హీరోగా రూపొందిన ‘పండుగాడి ఫోటోస్టూడియో' సినిమాలో వేడి రగిల్చే విధంగా పొలిటికల్ నేపథ్యం ఉన్న డైలాగులు ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

నెక్ట్స్ ఎలక్షన్లో ఓటేయడానికి ఫింగర్ ఉండదు
నెక్ట్స్ ఎలక్షన్లో ఓటు వేయడానికి ఫింగర్ ఉండదు.... అంటూ అలీ చెప్పే డైలాగుతో ‘పండుగాడి ఫోటోస్టూడియో' మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేక పోయినా... ఏపీ ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

సినిమా కథ ఇదే
చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ‘పండుగాడి ఫోటోస్టూడియో' చిత్రానికి ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయిపోద్ది' అనేది ఈ చిత్ర క్యాప్షన్. హీరోకు 40 సంవత్సరాలు వచ్చేవరకు పెళ్లికాదనే నాగ దేవత శాపం ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ కంచు కనకరత్నం పరిచయం, ఆమెతో ప్రేమ, మరోపక్క శాపం వల్ల జరిగే పరిణామాలు హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు.
సుకుమార్ విడుదల చేసిన ట్రైలర్ ఇదే
ఈ మూవీ ట్రైలర్ ప్రముఖ దర్శకుడు సుుకమార్ శుక్రవారం విడుదల చేశారు. ఇందులో అలీ సరసన హీరోయిన్‌గా రిషితను పరిచయం చేస్తున్నాం. వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి, రామ్ జగన్, సందీప్ రాజా, టీనాచౌదరి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాం, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications











