బాలకృష్ణ నటిస్తున్న పాండురంగడు సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అనువుగా సినిమా నిర్మాణాన్ని దర్శకుడు కె. రాఘవేంద్రరావు వేగవంతం చేశారు. మిగతా దర్శకులతో పోలిస్తే సినిమా నిర్మాణానికి తక్కువ సమయం తీసుకునే రాఘవేంద్రరావు ఇప్పటికే చాలా వరకు సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ టైటిల్ రోల్ ను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగానూ కనిపిస్తారు. టబు, స్నేహ బాలయ్య సరసన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అర్చన రుక్మిణి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాపై బాలకృష్ణ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. మేలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.