బాలకృష్ణ ,స్నేహా,టబు కాంబినేషన్ లో రాఘవేంద్రరావు రూపొందించిన పాండురంగడు మే 30న రిలీజు కాబోతుంది.అలాగే ఆడియో ఈ నెల 27న మచిలీ పట్నం దగ్గర చిలకలపూడి లో విడుదల చేస్తున్నారు.ఇందులో టబు వేశ్య గా ప్రధాన పాత్రను పోషిస్తోంది.స్నేహ భర్తలో మార్పు కోరుకునే భార్యగా నటిస్తోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.పుండరీకుడిగానూ,శ్రీ కృష్ణుడుగానూ ఆయన విభిన్న గెటప్ లలో కనిపిస్తారు.ఈ పౌరాణికి చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం రొమాంటిక్ టచ్ తోనూ, సెకాండాఫ్ భక్తితోనూ మెరవబోతోంది. అలాగే రామదాసు, అన్నమయ్య చిత్రంలో ప్రత్యేకంగా కనపడిన సుమన్ మరో కీలక పాత్రలో కనిపిస్తాడట. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పాండురంగ మహత్య్మం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రచన భారవి.సంగీతం కీరవాణి. కె.కృష్ణ మోహన్ తన ఆర్.కె.బ్యానర్ పై నిర్మిస్తున్నారు.