9000షో స్ తో 'పంజా' రిలీజ్

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా ఈ నెల తొమ్మిదవ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంను ప్రపంచవ్యాప్తంగా 1800 ధియోటర్స్ ,9000 షోస్ లతో స్క్ర్రీన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నిర్మాతలు మాట్లాడుతూ...అధిక ప్రింట్లతో విడుదల పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో సినిమాని విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కోసం పోలండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి అనేక దేశాల నుంచి కాల్స్ వస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. తమిళంలోనూ ఈ సినిమాని విడుదల చేస్తున్నాం అన్నారు. అలాగే ఈ సినిమాకి 110 రోజులు షూటింగ్ జరిపితే అందులో 55 రోజులు కోల్‌కతాలో జరిపినవే. ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఇంత తక్కువ టైమ్‌లో తీశామంటే అందరూ బాగా సహకరించడం వల్లే. మేం ఖర్చుపెట్టిన ప్రతి పైసా సినిమాలో కనిపిస్తుంది అన్నారు.

కథానుసారంగా చిత్రంలో పవన్ కళ్యాణ్ పేరు జయదేవ్‌. అయితే అందరూ జై అంటుంటారు. మాఫియా నేపథ్య కథాచిత్రమిది. ఇందులో మాఫియా మెంబర్‌గా పవన్‌కల్యాణ్‌ నటించారు. అంతమాత్రాన చిత్రం సీరియస్‌నెస్‌గా ఉంటుందని అనుకుంటే పొరపాటే. అందమైన ప్రేమకథ ఉంది. మంచి కామెడీ ఉంది. బ్రహ్మానందం, అలీ తమదైన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేస్తారు. ఎక్కడా లెంగ్తీ డైలాగ్స్‌ ఉండవు. ఇక యాక్షన్‌ అనగానే సుమోలు లేచిపోవడం వంటివి కాకుండా చిత్ర కథపరంగా ఎక్కడ ఏది ఎంత అవసరమో అక్కడ అది అంత మోతాదులోనే ఉంటుంది. పవన్‌కల్యాణ్‌ చిత్రమనగానే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటికి ఎంతమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X