‘పంజా’కు స్పాట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు
పవన్ కళ్యాణ్ హీరోగా, విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న పంజా సినిమా ఆడియోను నవంబర్ 13న విడుదల చేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆడియో వేడక స్పాట్ ఎక్కడ అనే విషయం గురువారం డిసైడ్ అయింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియాన్ని 'పంజా" ఆడియో విడుదల వేదికగా నిర్ణయించారు. భారీ ఎత్తున ఆడియో వేడక వేడుక నిర్విహించేందుకు ఈ ప్లేసు అయితేనే బెటరని నిర్మాతల అభిప్రాయం. ఈ సినిమాలో పవన్ సరసన సారా జాన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తుండగా...యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్నారు.
పవన్ ఈ సినిమాలో దెబ్బతిన్న పులి పాత్రను పోషిస్తున్నారు. పంజాలో పవన్ స్టిల్స్ చూస్తేనే అర్థం అవుతోంది ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుందని అంటున్నారు. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











