రికార్డులు మొదలు పెట్టిన పవన్.. ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ చేస్తుందా...?
పవన్ కళ్యాణ్ విష్ణువర్థన్ ల లేటెస్ట్ వండర్ 'పంజా' చిత్రం ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం పై ఫస్ట్ డే రికార్డ్స్ ను బద్దలు కొడుతుందా అనే చర్చలు సాగుతున్నాయి. విడుదలకు ముందే యాభైకోట్ల బిజినెస్ తో రికార్డులు మొదలు పెట్టిన 'పంజా' విడుదలైన తొలి రోజే మరో అరుదైన రికార్డుని నెలకొల్పుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1800ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం విడుదలైన తొలిరోజే ఎనిమిదివేల షోస్ ప్రదర్శింపబడి ఈ విధంగా రికార్డు సాధిస్తోంది.
అయితే సినిమా టాక్ పూర్తిగా తెలియకుండానే 'పంజా' రికార్డులు ఈ విధంగా వుంటే హిట్ టాక్ మొదలైతే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అన్ బ్రేకబుల్ రికార్డ్స్ 'పంజా'కు దాసోహం కావడం అనివార్యమని ట్రెడ్ వర్గాలు చెబుతున్నారని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'ఊసరవెల్లి' తొలి రోజు 7.3కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డును పంజా' బ్రేక్ చేస్తుందా? లేదా అని సినీ వర్గాలు ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నారు. కానీ పంజా' చిత్రానికి వచ్చిన హైప్ కి ఖచ్చింగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని మెగాఅభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











