'పంజా' స్టేటస్ పై పెదవి విప్పిన నిర్మాత
పంజా విడుదలై వారం అవుతుంటే ఇన్నాళ్లుకు పంజా నిర్మాతలు మీడియా ముందుకు వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పంజాని డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ అని, రెండవ వారం నుంచి వారు లాభాల్లో పడతారని అన్నారు. సినిమా టాక్ బాగోకపోయినా అద్బతమైన ఓపినింగ్స్ వచ్చాయన్నారు. నిర్మాత నీలిమ మాట్లాడుతూ.. తన లక్ష్యం పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యటేమేనని, అలాగే పవన్ ని స్టైలిష్ గా, కంట్రోల్డ్ ఫెరఫార్మెన్స్ తో చూపాలని, అది తాము సాధించామని చెప్పారు. ట్రేడ్ పండితులు మాత్రం ఇప్పటి వరకూ పంజా మంచి బిజినెస్సే చేసిందని, పవన్ కళ్యాణ్ గత చిత్రం తీన్ మార్ తో పోలిస్తే ఓపెనింగ్ కలెక్షన్స్ తో పంజా బాగా రాబడుతోందని అంటున్నారు. అదేవిధంగా రీసెంట్ విడుదలైన మహేష్ బాబు చిత్రం దూకుడు, జూ ఎన్టీఆర్ చిత్రం ఊసరవెల్లితో పోల్చుతూ ఈ రెండు చిత్రాలకంటే ఎక్కువగా గానే పంజా ఓపెనింగ్స్ రాబట్టిందిని చెప్తున్నారు.
దీని ప్రకారం పంజా మూడు రోజుల కలెక్షన్స్ వివారల్లో కి వెలితే...సినిమా బడ్జెట్ 33కోట్లు, ఓపెనింగ్ థియేటర్స్ 1800. ప్రపంచ వ్యాప్తంగా 8000 షోష్ తో విడుదలైంది. ఇక పంజా చిత్రం గురించి పబ్లిసిటీ పెంచటం లేదని, పైరసీని అరికట్టడం లేదని, కలెక్షన్స్ గురించి వారు మాట్లాడటం లేదని ఫ్యాన్స్ కంప్లైంట్ ఉంది. మరి దీనికి నిర్మాతలు ఏమి సమాధానం ఇస్తారో చూడాలి. అయితే నిర్మాతల ఆకాంక్ష నెరవేరిందని చెప్తున్నారు కాబట్టి పంజాపై వారు వేరే ప్రాజెక్టులో బిజీ అయ్యి దీన్ని ప్రక్కన పెడతారో చూడాలి.


Click it and Unblock the Notifications











