'పంజా'ఆడియో పంక్షన్ హైలెట్స్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా'ఆడియో శనివారం రాత్రి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది.తెలుగు సినీ మహారధులు పాల్గొన్న ఈ పంక్షన్ అభిమానుల సమక్షంలో ఓ వేడుకలా జరిగింది.అలాగే పవన్ కళ్యాణ్ మనస్సు విప్పి మాట్లాడిన మాటలు హైలెట్ గా నిలిచాయి.ఆయన ఉద్వేగంగా మాట్లాడుతూ..''నేను చిత్రసీమలో అడుగుపెట్టి పదిహేనేళ్లు అయ్యాయని కొన్ని వెబ్‌సైట్లు రాశాయి. ఆ విషయం నాకు తెలీదు. అభిమానులు నన్ను వారి గుండెల్లో పదిలంగా దాచుకొన్నారు. ఆ అభిమానాన్ని నా గుండెల్లో ఉంచుకొంటాను. కానీ తలకెక్కించుకోను.సినిమా అనేది సమష్టి కృషి. అందుకే సినిమా హిట్టయినప్పుడు ఆ కిరీటాన్ని నేను మాత్రమే నెత్తిన పెట్టుకోవాలనుకోను.అభిమానులు చూపించే అభిమానాన్ని ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటాను.నన్ను నేను నిరూపించుకోవడానికి ఐదారేళ్లు పట్టింది.అభిమానుల ప్రేమను నిజాయతీగా సాధించాను.ఆ ప్రేమను పొందడానికి ఎంత కష్టమైనా పడతాను. సినిమా అనేది కష్టంతో కూడుకొన్న పని. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను.
అన్ని సినిమాలూ మెప్పించాలనే కష్టపడ్డాను. నిర్లక్ష్యం అనే మాటకు అర్థం తెలీదు. విష్ణువర్థన్ గురించి నాకు ఎస్.జె.సూర్య చెప్పాడు. ఆయన్ని కలుసుకొన్నాను. నా అభిప్రాయాలు పంచుకొన్నాను. అనుకొన్నట్టుగానే సినిమా బాగా తీశారు. యువన్‌శంకర్ రాజా మంచి పాటల్ని అందిచారు. నాతో సినిమా చేయమని ఏ దర్శకుడినీ అడగలేదు.'పంజా'నన్ను అభిమానించే వాళ్లు తీసిన సినిమా ''అన్నారు. తొలి సీడీని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించారు. ఈ వేడుకకి హాజరైన పవన్ కుమారుడు అకిరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో రానా, దర్శకుడు విష్ణువర్ధన్, నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభయార్లగడ్డ, వెంకట్ దేవినేని, నగేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆడియో వేడుకలో పాల్గొనడానికి వచ్చిన అభిమానులతో గచ్చిబౌలి స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. ఓ సందర్భంలో అభిమానులను అదుపుచేయలేక పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











