twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'పంజా'ప్రి రిలీజ్ టాక్ ఏంటి?

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ పంజా నే ఇప్పుడు అన్ని చోట్లా హాట్ టాపిక్. అందులోనూ వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న పవన్ ఈ చిత్రం చాలా ఆశలే పెట్టుకుని ఉన్నారు. ఆడియో రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం అంతటా పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. అందులోనూ ట్రైలర్స్ లో బ్రహ్మానందం పై పాట చూపటంతో అప్పటివరకూ ఈ స్టైలిష్ ఎంటర్టైనర్ బి,సి సెంటర్స్ కి వెళ్ళదేమో అని అనుమానపడిన వారికి సైతం ఎక్కడైనా ఢోకా లేదనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఇంతకుముందు లేని విధంగా పవన్ తొలిసారిగా గెడ్డం పెంచటం,పంచ్ డైలాగులు చెప్పటం వంటివి మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. దాంతో గ్యారెంటీగా ఖుషీ రేంజి హిట్ అయ్యే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    దీనికి తోడు దర్శకుడు విష్ణు వర్దన్ తమిళ భిళ్లా చూసిన వారు అతని టేకింగ్ కి ఆశ్చర్యపోతారు. అదే డైరక్టర్ చేసిన చిత్రం కావటంతో ఈ సినిమా ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు. నయనతారను బికినీలో చూపి భిళ్లాకి క్రేజ్ తెచ్చిన దర్శకుడు ఈ చిత్రంలోనూ బెల్లి డాన్స్ ను పెట్టి తెలుగు వారికి కొత్త టేస్ట్ చూపబోతున్నారు. మరో ప్రక్క సెకెండ్ హాఫ్ లో వచ్చి ప్లాష్ బ్యాక్ హైలెట్ అంటూ వార్త ప్రచారం కావటం కూడా సినిమా పై ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రం డిసెంబర్ తొమ్మిదన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో పవన్ మాస్ క్యారెక్టర్ ని చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని నిర్మాతలు చెప్తున్నారు. యవన్ శంకర్ రాజా అందించిన ట్యూన్స్ ఇప్పుడు అంతటా మారు మ్రోగుతున్నాయి. ఫైనల్ గా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే చిత్రం అవుతుందని,సంవత్సరం చివరలో వచ్చే బిగ్గెస్ట్ హిట్ అని అంచనాలు వేస్తున్నారు.

    English summary
    Pawan's upcoming film panja gets super hit pre release talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X